కేటీఆర్ బంధువుకు డ్రగ్స్ కేసులో సంబంధాలు

కేటీఆర్ బంధువుకు డ్రగ్స్ కేసులో సంబంధాలు
October 28 04:12 2017

హైదరాబాద్:శాసనసభలో శుక్రవారం నాడు మాదకద్రవ్యాలకు సంబంధించి నా ప్రశ్న వచ్చేసరికి సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతకు ముందు ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని అయన గుర్తు చేసారు. ఈరోజు అయన అసెంబ్లీ ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజాన్ని మాదక ద్రవ్యాలు పట్టిపీడిస్తున్నాయి. కెసిఆర్ మనవడు చదువుతున్న పాఠశాలకు, సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి సీట్ విచారణ అంశాలను సభలో చెప్తారని సమాజం వేచి చూసింది.లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తే వారి బాగోతం బట్ట బయలు అవుతుందనుకుంటున్నారు.  మంత్రి కేటీఆర్ కు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందనే అనుమానం ఉందని  అయన అన్నారు. తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీ విచారణ జరిపించాలన్నారు. దీనిపై తాను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని, ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నా… దమ్ముంటే నాపై కేసు పెట్టండి అని రేవంత్ అన్నారు. అలాగే డ్రగ్స్ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశాననిఆయన అన్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5010
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author