ఆ స్టార్ హీరోకు పవన్ కల్యాణ్ రికమండ్ ..!

ఆ స్టార్ హీరోకు పవన్ కల్యాణ్ రికమండ్ ..!
October 28 04:19 2017

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సర్క్యులేట్ అవుతోంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తం షాట్కు క్లాప్ కూడా కొట్టిన విషయం తెలిసిందే. అయితే కథను రాసుకున్న వెంటనే మళ్లీ పవన్తోనే ఆ సినిమాను కూడా తెరకెక్కించాలని భావించారట త్రివిక్రమ్. వెంటనే ఆ కథను పవన్కు వినిపించారట. పవన్కు కూడా కథ బాగా నచ్చేసిందట. కానీ ఆ కథకు తాను సూట్ కానని.. ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతారని పవన్ సలహా ఇచ్చారట. ఆయన సలహా మేరకు త్రివిక్రమ్ కథను ఎన్టీఆర్కు వినిపించారని సమాచారం. కథ విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేశారట. ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరోని సజెస్ట్ చేయడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5013
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author