రాజకీయాలకు బొత్స అనర్హుడు : ఎమ్మెల్సీ వెంకన్న

రాజకీయాలకు బొత్స అనర్హుడు : ఎమ్మెల్సీ వెంకన్న
October 28 04:31 2017

విజయవాడ:వైకాపా నేత బొత్స సత్యనారాయణ పేరులో సత్యం ఉంది కాని ఆయనలో లేదు. ఈడీ చార్జిషీట్ లో బొత్స పేరు ఉన్నందున బొత్స సమాధానం చెప్పాలని  టీడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేసారు.  అసలు బొత్స సత్యనారాయణ రాజకియాలకు అనర్హుడని అయన అన్నారు. వైసిపి అవినీతి పార్టీ కాబట్టి విజయసాయిరెడ్డికి రాజ్యసభ, బొత్సకు పార్టీ కమిటీ లో చోటు దక్కిందని అన్నారు. దివంగత ఎన్టీఆర్ సిద్దాంతాలని జగన్ ఫాలో అయితే నిజాయితీ గురించి మాట్లాడాలి. ఈడీ జప్తు చెసిన ఆస్తులపై నేను తప్పు చేయలేదని జగన్ ఎందుకు చెప్పడం లేదని అన్నారు. జగన్ పాపప్రక్షాళన కోసం మొకాళ్ళ యాత్ర చేయాలే తప్ప పాదయాత్ర కాదని అన్నారు. 20 మంది శాసనసభ్యులను రాజీనామా చేయమనే నైతిక హక్కు జగన్ కు లేదు. పొరుగు రాష్ట్రాల్లో ఉండి విలాసమంతవైన జివితం గడిపి  ఎపిలో పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసారు. వైసిపి లో ఉన్న నేతలు ఆత్మపరిశీలన చేసుకోండి..జగన్ ఆస్తుల కోసమే పాదయాత్రని ఆ పార్టీ నేతలు గుర్తించాలని అన్నారు. చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలడం కాదు ఈడీ కి సమాదానం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో జగన్ పాదయాత్ర చేయడానికి వీలు లేదు..ఒకవేల పాదయాత్ర చేపడితే ఆ నేల అంతా శుద్ధి చేస్తామని అన్నారు.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5019
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author