చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు

చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు
October 28 12:12 2017

బహిరంగ మార్కెట్‌లో కొన్ని రోజులుగా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ వివిధ రకాల కూరలు పావు కిలో రూ.20 వరకూ విక్రయిస్తున్నారు. వర్షాకాలం దాటిన తరువాత ఆకుకూరల ధరలు పెరగడం విశేషం. రైతుల వద్ద అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వినియోగ దారులకు ధరలు భారీగా పెంచి విక్రయిస్తున్నారు. దళారీ పాత్ర అధికంగా ఉంది. రైతు బజార్లలోనూ కూరల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెద్ద ఉల్లి ధర పెరుగుదల ఉన్నా మార్కెటింగ్‌ శాఖ అధికారులు పట్టించు కోవడంలేదు. రైతు బజారలో కూడా ధరల పెరుగుదల ఎక్కువగానే ఉంది. కర్నూలు నుంచి వచ్చిన అతి చిన్న సైజు పాయలు రూ.18కు విక్రయి స్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపా యలు కిలో రూ.40 వరకూ విక్రయిస్తునారు. విస్తారంగా వర్షాలు కురిసి ఆకుకూరలు, కాయగూరలు విస్తారంగా పండినా ధరలు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. రెండు నెలలుగా క్యారెట్‌,బీట్రూట్‌, ముల్లంగి, బీన్సు ధరలు భారీగా పెరగ్గా నెల రోజులుగా అన్ని రకాల ధరల గణనీయంగా పెరిగాయి.

ప్రస్తుతం గుంటూరు రైతు బజార్లలో టమోటా ధర కిలో రూ.34 ఉండగా ఇతర మార్కెట్లలో కిలో రూ.60కు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారులు అర కిలో రూ.35, పావు కిలో రూ.20కి అమ్ముతున్నారు. రైతు బజార్లలో క్యారెట్‌ ధర రూ.68 ఉండగా ఇతర మార్కెట్‌లలో క్యారెట్‌ ధర రూ.80 పలుకుతోంది. పచ్చి మిర్చి ధర కిలో రైతు బజార్లలో రూ.35 ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.60 విక్రయిస్తు న్నారు. బీట్‌ రూట్‌ రైతు బజార్లలో రూ.49 ఉండగా ఇతర ప్రాంతాల్లో రూ.80 వరకూ ఉంది. బంగాళ దుంపల ధర చాలాకాలంగా స్థిరంగా ఉంది. రైతు బజార్లలో రూ.17 ఉంటుండగా బహిరంగ మార్కెట్‌లో రూ.20కి విక్రయిస్తున్నారు.

టమాటా ధర భారీగా పెరగడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారా కోడూరు ప్రాంతంలో దొండకాయలు పండించే రైతులకు కిలో రూ.5 మాత్రమే దక్కుతోంది. బహిరంగ మార్కెట్‌లో రూ.40వరకూ విక్రయిస్తున్నారు. జిల్లాలో విస్తారంగా పండించే ఆకు కూరల కట్టలు ఒక్కొంటికి రూ.8 నుంచి రూ.10 వరకూ విక్రయిస్తున్నారు. వివిధ రకాల కూరల ధరలు ఒక్కొ చోట ఒక్కొ ధరకు విక్రయిస్తున్నారు. వీటిని ఇంతధరలోనే విక్రయించాలనే వ్యవస్థ లేకపోవడం వల్ల ఎవరి ఇష్టం వారిదిగా మారింది. బహిరంగ మార్కెట్‌లో విక్రయించే ధరకు కిలో రూ.మూడు లేదా నాలుగు తగ్గించి రైతు బజార్లలో ధరలను నిర్ధారిస్తున్నారు. ఆ ధరల ప్రభావం వినియోగదారులపైనే అధికంగా ఉంటోంది.

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5034
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author