విషజ్వరాలతో ఖమ్మంలో కలవరం

విషజ్వరాలతో ఖమ్మంలో కలవరం
October 28 13:42 2017

మూడు నెలలుగా మండలంలో విజృంభిస్తున్న జ్వరాలు నేటికి అదుపులోకి రాకపోవడంలో మండలంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో డెంగ్యూ వ్యాధితో 18మంది మృతిచెందారు. మండలంలోని ప్రజలు డెంగ్యూ భయంతో ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం జ్వరం వచ్చినా వైద్యశాలల వైపు పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. మండల పీహెచ్‌సీలో మూడు నెలల నుంచి 3,980మందికి జ్వరాలు సోకడంతో వారందరికీ మలేరియా జ్వరాల నిర్ధారణ, 18,016 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకున్నారు. వైద్యాధికారి బాలాజీ 786 మందికి రక్తనమూనాలను వ్యాధి నిర్ధారణ కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి పంపించగా వాటిలో 305 డెంగ్యూ పాజిటీవ్‌గా రావడంతో రోగులు భయాందోళనలకు లోనవుతున్నారు. మండలంలోని 22గ్రామాల్లో 15 గ్రామా ల్లో డెంగ్యూ జ్వరాలతో చంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు జ్వరాల బారిన పడుతూనే ఉన్నారు. ఒకపక్క తగ్గుముఖం పట్టినప్పటికీ ఆగ్రామం నుంచి మరో గ్రా మానికి ఈ డెంగ్యూ వైరస్ సోకి ప్రతి గ్రామంలో ప్రజలను అల్లాడిస్తుంది. జిల్లా వైద్యాధికారులు డెంగ్యూ నివారణ కోసం డీవాటరింగ్ విధానాన్ని అమలు చే యాలని పంచాయతీరాజ్ అధికారులు చేపుతున్నారు. ఈవిషయంపై రాష్ట్రస్థాయిలో వైద్యశాఖ ప్రత్యేక దృష్టిసారించినప్పటికీ జ్వరాలు మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజల్లో మరింత భయాందోళన రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈవిషజ్వరాలపై డెంగ్యూ దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప ప్రజల ప్రాణాలకు రక్షణ చేకూరుతుందని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5051
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author