రాజకీయాలు మాని రైతులకు సహకరించండి

 రాజకీయాలు మాని రైతులకు సహకరించండి
October 28 15:02 2017

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి  5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ… రైతు సమన్వయ సమితిల ద్వారా 5 వేల సెంటర్లలో పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. జనుము సాగుకు 50శాతం సబ్సిడీ ఇస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా నీరు వస్తోందన్నారు. అలాగే పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచడం లేదన్నారు.  కాంగ్రెస్ నాయకులపై మంత్రి మండిపడ్డారు. ఆ నేతలు  రాజకీయాలు మాని రైతులకు సహకరించాలని మంత్రి అన్నారు. రైతులందరూ అందము కలిసి కొనుగోలు కేంద్రము దగ్గర కొనుగోలు చెయ్యడానికి రైతు సమన్వయ సంఘాలు సహకరించాలని అన్నారు. అంతకుముందు అయన కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్ ప్రాజెక్టులో 48.18లక్షల చేప పిల్లల్ని చేపలను విడుదల చేసారు.

 

 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5065
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author