ప్రపంచ తెలుగు మహాసభలకు అంతా సిద్ధం

ప్రపంచ తెలుగు మహాసభలకు అంతా సిద్ధం
October 30 11:50 2017

తెలంగాణ భాషా సాహిత్య వికాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు  ప్రభుత్వం సిద్ధమూతోంది. డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే అతిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  , తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించేలా మహాసభలను నిర్వహించాలని సీఎస్ ఎస్పీసింగ్ అధికారులకు సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్ల పై శాఖల వారిగా సమీక్ష నిర్వహించాలని అదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు, ఆలోచనలకు అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలను రూపోందించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ దేశాలనుంచి 500 మంది, దేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి 1000 మంది, రాష్ట్రంలో ఉన్న సాహితి, భాషా వేత్తలను మహాసభలకు ఆహ్వానించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఉపాధ్యాయులు, భాషా పండితులు, ఆచార్యులను, భాషా అభిమానులను మహాసభల ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో 5000 వేలమందిని ఆహ్వానించాలని సూచించారు. మహాసభల వేడుకలు నిర్వహించే వేదికల వద్ద డిజైన్ లను సిద్దం చేయాలన్నారు. హెచ్ ఎమ్ డి ఎ , జి హెచ్ ఎం సి శాఖల ద్వారా నగరాన్ని స్వాగతతోరణాలతో సుందరీకరించాలన్నారు. పోలిస్ శాఖ ద్వారా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ మ్యాప్ ల రూపకల్ఫన తదితర పనులను చేపట్టాలన్నారు. ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ని , ముగింపు వేడుకలకు ఉప రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి లను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల  ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రవేట్ విద్యా సంస్థలలో వ్యాసరచన, వక్తృత్వ పోటిలు నిర్వహించి రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకోనేలా  చూడాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రానికి వచ్చే అతిదులకు వసతి, రవాణా తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమాచార శాఖ ద్వారా హోర్డింగ్స్ , ఎల్ ఇ డి స్ర్కీన్స్ , ప్రకటనల ద్వారా పబ్లీక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని,తెలుగు మహాసభల సందర్భంగా  తెలంగాణ మాస పత్రిక  ప్రత్యేక సంచిక వెలువరించాలని సూచించారు. ఐటి శాఖ ద్వారా సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణా చారి మాట్లాడుతూ గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఎలాంటి సంబందం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్నతోలి ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలన్నారు.సీఎం కేసీఆర్  ప్రపంచ తెలుగు మహాసభల వెబ్ సైట్ ను ఇప్పటికే ప్రారంభించారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను నగరంలో 7 వేదికల ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యాపార సంబంధంగా నిర్వహిస్తున్న దుకా ణాలకు తెలుగులో పేర్లు ఉండేలా కార్మిక శాఖ చర్యలు చేపట్టాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రచారం కోసం  వివిధ రాష్ట్రాలలో  తెలుగు  ప్రజలు ఏక్కువగా  ఉన్న ప్రాంతాలలో నవంబర్ మెుదటి వారం నుంచి కోర్ కమీటి సభ్యులు  పర్యటిస్తారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదిక గా లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహించాల్సిన  కార్యక్రమాలపై చర్చించారు. ప్రపంచ తెలుగు మహాసభల కోసం రవీంద్ర భారతి లో ఇప్పటికే కార్యాలయం ను ఏర్పాటు చేసామన్నారు.  ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్ల పై జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం  మహాసభల నిర్వహణ ను పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ద్వారా వివరించారు. గతంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాల విజువల్స్ , ఫోటోలను చూపారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను సమీక్షా సమావేశంలో వివరించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5150
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author