ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నరేవంత్

ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నరేవంత్
October 30 13:47 2017

తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనమల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సి కుంతియా చెప్పా రు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతున్నట్లు సమాచారం తన వద్ద ఉంది. పార్టీ లో చేరేందుకు రేవంత్ ఎలాంటి షరతులు పెట్టలేదని, మేం కూడా ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేద ని ఒక ప్రశ్నకు సమాధానంగా కుంతియా చెప్పారు. కాంగ్రెస్‌లో పని చేసే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తిం పు ఉంటుందని, గత కొన్నేళ్ళుగా పార్టీ కోసం పని చేసిన వారికి వీలున్నప్పుడల్లా పదవులను ఇచ్చామని అన్నారు. రేవంత్ రాకను పార్టీలోని వారంతా స్వాగతిస్తున్నారని, ఎవరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు కూడా రేవంత్ రాక పట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు. రేవంత్‌తో పాటు టిడిపికి చెంది న వారెవరెవరు చేరుతారన్న అంశంపై సోమవారం సాయంత్రానికల్లా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయ న్నారు. రేవంత్‌రెడ్డే కాదు మరికొన్ని పార్టీలకు చెంది న వారు కూడా తమతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే మరిన్ని చేరికలుండవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి రాహుల్‌గాంధీ సమక్షంలో చేరికలుంటాయని, నవంబర్ 9న మహబూబాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. ఈ సభకు గిరిజన గర్జన పేరుతో నిర్వహిస్తే బాగుంటుందని నేతలు పేర్కొన్నారని, దీనిపై రాష్ట్ర పార్టీ నేతలం తా చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తారని, ఆ తర్వాత ఎఐసిసి తుది నిర్ణయం తీసుకుంటుందన్నా రు. రేవంత్ చేరికకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కుంతియా ఆదివారం భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని పార్టీ సీనియర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధిష్ఠానం నిర్ణయాన్ని నేతలకు స్పష్టం చేశారు. రేవంత్ రాకతో తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందని, ఆయన చేరికపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా ప్రస్తుతానికి పక్కకు పెట్టాల్సిందేనని చెప్పినట్లు తెలిసింది. రేవంత్ చేరిక సందర్భంగా ఢిల్లీకి రావాలని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, ఎంఎల్‌ఎ డికె అరుణ తదితరులకు కుంతియా సూచించారు. రేవంత్‌కు పార్టీలో ఇచ్చే పదవి, ఆయనకిచ్చే ప్రాధాన్యతలు తదితర అంశాలన్నీ అధిష్టానానికి వదిలేయాలని కూడా కుంతియా స్పష్టం చేశారని తెలిసింది. కుంతియాతో జరిగిన సమావేశంలో పార్టీకి చెందిన సీనియర్‌లందరూ దాదాపు హాజరయ్యారు. అనంతరం పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలు కొందరితో కుంతియా ఏకాంతంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లా రాజకీయాలకు ప్రాధాన్యమివ్వొద్దని, ప్రస్తుత పరిస్థితులలో టిఆర్‌ఎస్‌ను, సిఎం కెసిఆర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆయన వ్యతిరేకులను పార్టీలోకి ఆహ్వానించాల్సిందేనని స్ఫష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో కలహించుకుంటే పార్టీకే నష్టమని, పార్టీ కంటే వ్యక్తిగతంగా నష్టమన్న విషయాన్ని తెలుసుకోవాలని కుంతియా సూచించారని అంటున్నారు. రేవంత్ వల్ల మీకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత మాది. పని చేసే వారిని పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది అని స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5166
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author