పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
October 30 14:44 2017

చలి ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా తగ్గుతున్నాయి. నైరుతి రుతుపవనాలు విరమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. సాధారణంగా ఉండే కనిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 14, మెదక్‌లో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హకీంపేట, ఖమ్మంలో 18, నిజామాబాద్, భద్రాచలం, హైదరాబాద్‌లో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంలో సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. మెదక్‌లో 2 డిగ్రీల మేర తగ్గింది. దీంతో ఆయా ప్రాంతాల్లో చలి పెరిగింది. హన్మకొండ, హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు  సా ధారణంగానే ఉన్నాయి. మరోవైపు వచ్చే నాలుగైదు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5181
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author