పెట్రోల్ తో సైలెంట్ గా బాదేస్తున్నారు…

పెట్రోల్ తో సైలెంట్ గా బాదేస్తున్నారు…
October 30 14:55 2017

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. పైసా పైసా పెంచుతూ సైలెంట్‌గా బాదేస్తున్నారు. లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ.73 దాటిపోగా.. విశాఖలో రూ.74 దాటేసింది. గత నాలుగు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం (30.10.2017) లీటర్ పెట్రోల్‌పై 16 పైసలు వరకు పెరిగింది. ఇక లీటర్ డీజిల్ ధరపై కూడా 15 పైసలు వరకు పెరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.10 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.62.59గా ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.08, డీజిల్ ధర రూ. 63.77గా ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం వివరాల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5188
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author