సిక్కోలు లో మారుతోన్న సమీకరణాలు..

సిక్కోలు లో మారుతోన్న సమీకరణాలు..
October 30 15:13 2017

ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాల్లో బిసీలదే హవా. కాని – జిల్లాలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గాలైన కళింగ, తూర్పుకాపు, పోలినాటి వెలమ కులాలకు చెందిన వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఓటర్లల్లో 17.82 శాతం కాపు/తెలగ ఓటర్లు ప్రధమస్థానంలో ఉన్నారు. తర్వాత స్థానంలో 12.1 శాతంగా వెలమ సామాజికవర్గం ఉండగా, మూడోస్థానంలో 9.72 శాతం కళింగ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. పది నియోజకవర్గాల్లో వీరి మధ్యే ఎన్నికల కురుక్షేత్రం ప్రతీ సార్వత్రిక, ఉప ఎన్నికల్లో జరగడం పరిపాటి. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ప్రలోభపెట్టే విధానం ఒక ఎతె్తైతే, సామాజిక బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరోక ఎత్తుగడ. 2019 ఎన్నికలకు మాత్రం సామాజిక ఓటుబ్యాంకుపై జనసేనా అధినేత పవన్‌కళ్యాణ్ ప్రభావితం చేస్తారన్నది ఒక వాదన. అయితే, తన సామాజికవర్గమైన కాపు వర్గాలను కూడగట్టే ప్రయత్నాలు చాపకింద నీరులా సిక్కోల్ రాజకీయాల్లో జరిగిపోతున్నాయనడంలో అతిశయోక్తిలేదు. దీనికి వెలమ సామాజికవర్గం బలీయమైన మద్దతు ఇవ్వడానికి కూడా ఈ మధ్య జిల్లాకు చెందిన ఇద్దరు అధికారపార్టీ వెలమ ప్రజాప్రతినిధులు విశాఖపట్నంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారన్న సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మాకు బలం ఉన్నంత వరకే పోటీ చేస్తామని ప్రకటన అనేక సందేహాలకు, చర్చలకు తెరలేపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సర్దుకుపోవడం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. పది నియోజకవర్గాల్లో రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, శ్రీకాకుళం నిజయోజకవర్గం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలపై జనసేవ పోటీ ఉండకపోవచ్చునంటూ ఆ పార్టీ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోనే జనసేన పార్టీ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని చర్చ మొదలుపెట్టారు. దీనిబట్టి జనసేన ఎవరి ఓట్లు చీల్చబోతుందో అనే కొత్త చర్చ మొదలయ్యింది. సిక్కోల్ జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్న దానిపై స్పష్టత రావడంతో వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ఓ క్లారిటీ అయితే పవన్‌కళ్యాణ్ ఇచ్చేసారు. ఇక గత ఎన్నికల్లో జనసేనా స్థాపించినా బిజెపీ – టిడీపీ కూటమికి బలాన్ని ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, పవన్ సొంత సామాజిక వర్గమైన కాపు వర్గం ఓటర్లులో మొజార్టీ వర్గం ఓట్లు వైకాపాకు దూరమయ్యే వ్యూహానికే కసరత్తు ఆరంభమైంది. దీనికితోడు కళింగ సామాజిక నేతలను అణచితొక్కేయాలన్న వెలమ సామాజికవర్గం ఎత్తుగడకు జనసేన పార్టీ ఈసారి సపోర్టుగా నిలిచేందుకు సాహించినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను పక్కన పెట్టేస్తే – ప్రధాన పోటీ టిడీపీ – వైకాపా – జనసేన మధ్యే ఉంటుంది. ఎవరిమాట ఎలా ఉన్నా జిల్లాలో గల కాపు సామాజికవర్గం మాత్రం జనసేనా వైపు మొగ్గు చూపుతుందని, వీరితోపాటు యువత ఓట్లు కూడా పవన్‌కళ్యాణ్ ఆకట్టుకుంటారంటూ విశే్లషకులు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే – కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉన్న పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే అక్కడ ఆ ఓట్లు టీడీపీ అభ్యర్ధులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితుల్లో వైకాపా కంటే జనసేనాకు ఓట్లు ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే అవకాశాలు లేకపోతే వైకాపా విజయం వైపు వెళ్ళే అవకాశాలు ఉండోచ్చు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కళా, కలమటలు కాపు సామాజికవర్గం నేతలు అధికారం పార్టీకి చెందిన వారే. అయినప్పటికీ వారిపై జనసేన అభ్యర్ధులను నిలబెట్టడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ ఆరంభం కాకమానదు. దీని వెనుక చీకటి ఒప్పందాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా తలేత్తనున్నాయి. ఇదిలా ఉండగా, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కింజరాపు, గుండ కుటుంబాలకు బి.్ఫరాలు ఇస్తూ ఎమ్మెల్యేలుగా గెలుపొందేలా పార్టీ సాయిశక్తుల కృషి చేస్తుండడం తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవి, టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడులే అభ్యర్ధులు. వీరిపై జనసేన ఎందుకు అభ్యర్ధులను బరిలోకి దింపడం లేదని విశే్లషకులు తలలుపట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలని చెప్పుకుంటున్న వీరి ఇరువురుపై ‘పవర్’స్టార్ ప్రేమ వలకపోయడం వెనుక పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ‘కాపు’కాసే పనిలో జనసేనా ఫార్ములా అమలు చేస్తే – గతంలో పవన్‌కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే ప్రజావ్యతిరేక ఓటుబ్యాంకును కొల్లగొట్టుకుంటే టిడీపీ అధికారం సేఫ్‌జోన్‌లో ఉంచేందుకు అవకాశం ఉంటోందన్న సామాన్యులు సైతం భవిష్యత్తులు రాజకీయాలపై ఊహాగానాలు వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ, జనసేనా శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోనే బరిలోకి ఎందుకు అభ్యర్ధులను దించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నది మిలియన్ డాల్లర్ల ప్రశ్న??

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5197
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author