భారీగా పెరిగిన ఖరీఫ్ సాగు

భారీగా పెరిగిన ఖరీఫ్ సాగు
October 30 17:58 2017

మిషన్ కాకతీయ.. గ్రామీణ సామాజిక, ఆర్థిక రంగాల్లో అతి తక్కువ సమయంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తెలంగాణ సర్కారు ఏ లక్ష్యంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టిందో.. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు ఊహించినదానికంటే ముందుగానే వచ్చాయని రుజువైంది. పునరుద్ధరణ జరిగిన చెరువుల కింద సాగు విస్తీర్ణం, దిగుబడి.. రికార్డు స్థాయిలో పెరుగడం మిషన్ కాకతీయ అందించిన ఫలం. దీంతో రైతు కుటుంబాల ఆదాయమూ గణనీయంగా పెరిగింది. నాబార్డుతో తెలంగాణ ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందం మేరకు దాని అనుబంధ సంస్థ నాబ్కాన్స్ (నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్) చేపట్టిన శాస్త్రీయ అధ్యయనంలో మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా వివిధ రూపాల్లో ఫలితాలు లభిస్తున్నట్లు స్పష్టంగా తేలింది.అధ్యయనం చేసిన పరిధి: 400 చెరువులు, వాటి ఆయకట్టు పరిధిలో ఉన్న 12వేల కుటుంబాలు. ఉత్తర తెలంగాణ జోన్- కరీంనగర్ (85 చెరువులు), మధ్య తెలంగాణ జోన్ – మెదక్ (170 ట్యాంకులు), దక్షిణ తెలంగాణ జోన్ – నల్లగొండ (85 చెరువులు), ఎక్కువ ఎత్తులో ఉన్న, గిరిజన జోన్ – ఆదిలాబాద్ (60 చెరువులు)2013లో అధిక వర్షపాతం నమోదైనందున ఆ సంవత్సరం ఆధారంగా మిషన్ కాకతీయ మొదటి దశ అమలు తర్వాత వచ్చిన 2016 లోని పరిస్థితిని పోలుస్తూ కొనసాగిన అధ్యయనం. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు ఒక చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టు ఉందనుకుంటే 40 ఎకరాలకే నీరందేది. నీరందని ఆయకట్టును గ్యాప్ ఆయకట్టు అంటారు. మిషన్ కాకతీయ అమలు కంటే ముందు ఇది 42.4 శాతంగా ఉంటే, అమలు తర్వాత అది 19.2 శాతానికి తగ్గింది.చెరువుల్లో ఎక్కువ కాలం నీరుండటంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. 17శాతం ఎండిపోయిన బోర్లు, బావులకు మళ్లీ జలకళ వచ్చింది. ఇవి కేవలం ఆయకట్టు పరిధిలోనివే కాకుండా ఆయకట్టు అవతల ఉన్నవి కూడా ఉన్నాయి. 2013-14లో భూగర్భజలమట్టం పెరుగుదుల 6.91మీటర్లుగా ఉంటే.. 2016-17లో పెరుగుదల సరాసరి 9.02 మీటర్లుగా ఉంది.అధ్యయనం చేపట్టిన నాలుగు జిల్లాల పరిధిలోని 400 చెరువుల కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో 2016 వానకాలంలో అదునుకు వర్షం పడకపోయినా మిషన్ కాకతీయ వల్ల చెరువుల కింద 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. సెప్టెంబర్ మూడోవారంలో కురిసిన భారీ వర్షాలతో చెరువులన్నీ నిండుకుండలా మారడంతో యాసంగి సాగు జోరుగా సాగింది. ఫలితంగా రికార్డు స్థాయిలో చెరువుల కింద ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 10.50 లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఇది మునుపటికంటే 45.6 శాతం ఎక్కువ.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5246
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author