తిరుమలలో కుండపోత వర్షం

తిరుమలలో కుండపోత వర్షం
October 30 18:25 2017

తిరుమలలో భారీ వర్షం కురిసింది. వేకువజామున నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరపు లేకుండా కురుస్తుండడంతో   తిరుమల లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆగకుండా కురుస్తున్న వర్షానికి  శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్లిన భక్తులతో పాటు స్వామిని దర్శించుకుని వెలుపలకి వస్తున్న భక్తులు తడిసి ముద్దయ్యారు. ఆగకుండా వర్షం పడుతుండడంతో స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులలో కొంతమంది పరుగులు తీసి షెడ్ల క్రింద తలదాచుకున్నారు. భారీ వర్షంకు శ్రీవారి ఆలయ ప్రాగణంతో పాటు పలు ప్రాంతాలలో భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లపై దుకాణాలను నడిపే వారు పట్టలతో దుకాణాలను కట్టేశారు. భారీ వర్షనికి తిరుమలలో ఒక్క సారిగా వాతావరణం పూర్తిగా మారిపోయి౦ది. చలిగాలులు వీస్తుండంతో పాటు భారీగా పొగమంచు కురిసింది.  ఈఆహ్లాదకర వాతావరాణాన్ని భక్తులు ఎంజాయ్ చేసారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5276
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author