పడవనుంచి నల్లమల అందాల వీక్షణం

పడవనుంచి నల్లమల అందాల వీక్షణం
October 30 18:51 2017
చుట్టూ కొండలు…మధ్యలో కృష్ణానది పరవళ్లు… ఆహ్లాదకరమైన వాతావరణంలో పడవ ప్రయాణం కల్పిస్తుంది ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ.  కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వరకు  సుమారు 5 గంటల పడవ ప్రయాణిస్తూ మధురానుభూతిని సొంతం చేసుకొనే అవకాశాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ కల్పించనుంది.
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీలో వెళ్తూ దాదాపు 5గంటల పాటు నల్లమల సోయగాలను ఆస్వాదించే అవకాశం అందుబాటులోకి రానుంది. టూరిజం శాఖ అధికారులు గత ఆదివారం సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీలో నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. దీంతో పర్యాటకులకు ఈ ప్యాకేజీని నవంబర్ 1 తేదీ నుంచి   అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ యాత్రలో భాగంగా నల్లమల, కృష్ణానది అందాలను చూపించడంతో పాటు శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబాదేవి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. సాగర్ నుంచి లాంచీ బయలుదేరిన తర్వాత ఉదయం 11గంటలకు బిస్కెట్స్, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4గంటలకు స్నాక్స్ అందిస్తారు. లాంచీలో శ్రీశైలం, సాగర్‌లో సందర్శనీయ స్థలాలు, వాటి విశిష్టత తదితర వివరాలను పొందుపరుస్తూ రూపొందించిన వీడియోను ప్రదర్శిస్తారు.
వచ్చే నెల 1తేదీ నాడు ప్రారంభం కానున్న ఈ పడవ ప్రయాణం పర్యాటకులకు ఆకట్టుకుంటుందని టూరిజం అధికారులు అంటున్నారు. హైదరాబాద్, విజయవాడ నుంచి బస్సుల ద్వారా సాగర్‌కు చేరుకొని  అక్కడి నుంచి శ్రీశైలానికి లాంచీలో రానుపోనూ పెద్దలకు ధర రూ.3,600, పిల్లలకు రూ.2,500.ఉంటుంది.  అలాగే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి రావడానికి మాత్రమే (వన్‌వే) టికెట్టు ధర పెద్దలకు రూ.1,100, పిల్లలకు రూ.900. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు పోను(వన్ వే)టికెట్టు ధర పెద్దలకు రూ.1,100, పిల్లలకు రూ.900 ఉంటుంది. . ఆహ్లాదకర ప్రయాణానికి ఆధ్మాత్మికత తోడవడంతో పాటు పవిత్ర కార్తీక మాసం కూడా కావడంతో శైవక్షేత్రమ్ శ్రీశైలానికి వెళ్లేందుకు పర్యాటకులు పోటెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి నల్లమల అందాల మధ్య పడవ లో ప్రయాణిస్తూ కృష్ణమ్మ పరవళ్లు ను తనివి తీరా చూసే భాగ్యం కలుగుతుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5304
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author