పోలవరానికి ఖర్చు చేసిన వెయ్యి కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది: యనమల

పోలవరానికి ఖర్చు చేసిన వెయ్యి కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది: యనమల
October 31 10:03 2017

ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జీతాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడ్డామని,రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు భారీగా ఉన్నాయని అన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. జీఎస్టీ సర్దుబాటులో భాగంగా కేంద్రం నుంచి రూ. 116కోట్లు వచ్చాయని, పోలవరానికి ఖర్చు చేసిన వెయ్యి కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు నేరుగా చెల్లిస్తుందని. ఉపాధి నిధులు రూ. 1200 కోట్లు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు.రైతు సాధికార సంస్థకు రూ. 2వేల కోట్ల రుణానికి అనుమతిచ్చామని, ఆ నిధులతో రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని యనమల తెలిపారు. విపక్షం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం అడగడం హాస్యాస్పదమని అన్నారు. ఈ ఏడాది రూ.16వేల కోట్లు అప్పు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ గ్రోత్‌ రేట్‌ ఆశాజనకంగా లేదని, ఎక్సైజ్‌ ఆదాయం కొంత బాగుందని, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయిందన్నారు. రాబడులు పెరగాల్సిన అవసరం ఉందని. 20 వేల పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని 10 వేల పోస్టులను భర్తీ చేశాం. త్వరలో మిగతా పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి యనమల స్పష్టం చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5311
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author