తెలంగాణలో తన కాంట్రాక్టులు రేవంత్‌రెడ్డికే:యనమల

తెలంగాణలో తన కాంట్రాక్టులు రేవంత్‌రెడ్డికే:యనమల
October 31 10:08 2017

తెలంగాణ తెదేపా మాజీ నేత రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. తనకు తెలంగాణలో కాంట్రాక్టులుంటే వాటిని రేవంత్‌రెడ్డి తీసుకోవచ్చని, ఒకవేళ కాంట్రాక్టులపై కమీషన్‌ వచ్చినా వాటినీ తీసుకోవచ్చని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లడానికే రేవంత్‌ తనపై ఆరోపణలు చేశారేమో? అని మీడియాతో అన్నారు.తెదేపాకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఇదే విషయమై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసేందుకు ఆయన దిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. అప్పట్లో దీనిపై రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఏపీ తెదేపా నేతలపై మండిపడ్డారు. యనమలకు కేసీఆర్‌ కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5314
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author