ప్రకాశంలో పెరుగుతున్న క్రైమ్ రేట్

ప్రకాశంలో పెరుగుతున్న క్రైమ్ రేట్
October 31 14:11 2017
ప్రకాశం జిల్లాలో  క్రైమ్‌ రేటు రోజురోజుకు పెరిగిపోతోంది. నెలల వ్యవధిలో జిల్లాలో జరిగిన వరుస సంఘటనలు రాష్ర్ట స్ధాయిలో సంచలనం రేపాయి. ఓ వైపు లైంగికదాడులు,హత్యలు మరొవైపు భారీ దొంగతనాలతో నేరగాళ్ళు పోలీసులకు సవాల్ విసురుతున్నారు….సాక్షాత్తు రాష్ర్ట డిజిపి సొంత జిల్లాలో ఏ రోజు ఎలాంటి నేరం జరుగుతుందో తెలియని పరిస్ధితి  నెలకొన్నాయి..రెండు నెలల వ్యవధిలోనే  జిల్లాలో జరిగిన  వరుస నేరాలు రాష్ర్ట స్ధాయిలో చర్చనీయాంశంగా మారాయి. 14 హత్యలు, 10కి పైగా భారీ దొంగతనాలు జరిగాయి.  స్నేహం పేరుతో నమ్మిన యువతులపై లైంగికదాడులు ప్రకాశంజిల్లాను ఓ కుదుపు కుదిపేసాయి… రోజుల వ్యవధిలో జరిగిన వరుస సంఘటనలు పోలీసులకు సవాలుగా మారాయి. జిల్లాలో ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందోనన్న భయం ఇటు ప్రజలను అటు పోలీసులనూ వెంటాడుతుంది.  నెల వేటపాలెంలో ఆటో డ్రైవర్ గోపీచంద్   ప్రేమపేరుతో నమ్మించి లక్ష్మీ మణితేజ అనే యువతిని దారుణంగా హత్య చేసినఘటన.. కనిగిరిలో ఓ విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేయబోయిన వీడియో  సంచలనం సృష్టించాయి.  ఈ ఘటనలు మరవకముందే అప్పుగా డబ్బు ఇచ్చి…తిరిగి అప్పు చెల్లించమని అడిగిన పాపానికి ఒంగోలులోశ్రీనివాసరావు భార్య ప్రమీల దంపతులు దారుణ హత్య, సంతమాగులూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన యువప్రేమికులు…ఇంట్లోని పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతోనెల్లూరులో రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరులో బట్టల వ్యాపారి సత్యనారాయణ ఇంట్లో దొంగలు 80సవర్ల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన, ఒంగోలులో3 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు.  చీరాల ఎమ్మెల్యే సొదరుడి ఇంట్లో 250 సవర్ల బంగారం,25కేజీల వెండి,16లక్షల నగదు దోచుకెళ్ళారు. ఇలా రోజుకోచోట చోరీలు జరుగుతున్నా పోలీసులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమనే తెలిస్తుంది.పోలీసులు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టినా అనుకున్న స్ధాయిలో స్పందన రాలేదు. ప్రజల్లో అవగాహన
కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. వరుసగా జరుగుతన్న సంఘటనలు ప్రజల్లో పోలీసులపై నమ్మకం పోయేలా చేశాయి. ఇంత జరుగుతన్నా పోలీసు శాఖ ఏం చర్యలు తీసుకుంటుందని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నేరాలకు అదుపులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఎస్పీగా సత్య ఏసుబాబు బాద్యతలు చేపట్టినప్పుడు ప్రకాశం పోలీసులను కొత్తపుంతలు తొక్కిస్తారని, నేరాలు అదుపు చేసి శాంతి భద్రతలు నెలకొల్పుతారని అందరూ భావించారు. అయితే జిల్లాపై అనుభవరాహిత్యమో,మెతక వైఖరో తెలియదు గానీ జిల్లా ఎస్పీ అనుకున్న స్ధాయిలో పనిచేయడం లేదని….పోలీసు శాఖ సంక్షేమంపై వున్న శ్రద్ద నేరాల అదుపు చేయడంలోను,పోలీసులపై చర్యలు తీసుకోవడంలో లేదనే  విమర్శలు  ప్రారంభమైయ్యాయి….అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గి  పనిచేస్తున్నారనే  ప్రచారమూ జరుగుతుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5350
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author