వామ్మో…కూరగాయలు

వామ్మో…కూరగాయలు
October 31 14:15 2017

పెరిగిన కూరగాయాల ధరలతో సామాన్యుడు నడ్డీ విరుచినట్టు అవుతుంది.  ఒకవైపు   ఆకాలా  వర్షాలు …..మరోవైపు కార్తీకమాసం కావడంతో తూర్పుగోదావరి జిల్లాలోని కురగాయల ధరలు అధికంగా ఉన్నాయి…. దీంతో మధ్యతరగతి కుటుంభాలు కొనుగోలు చేయాలేని పరిస్ధితిలో ఉన్నామని  ఆందోళన చేందుతున్నారు.  అధిక ధరలను నియంత్రించాల్సిన అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ధరలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. పెరుగుతున్న అధిక ధరలపై ప్రత్యేక కధనం…. తూర్పుగోదావరి జిల్లాలో  కూరగాయలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం రైతుబజార్ ను ఏర్పాటు చేసారు. రైతు పండించే పంటను నేరుగా రైతు బజార్ కు తీసుకువచ్చి అమ్మకాలు జరపే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ నిభందనలు ఎక్కడా కనిపించడంలేదు. రైతుల నుంచి కొందరు దళారులు కొనుగోళ్లు చేసి రైతు బజార్ల వద్ద అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నారు. దీనికి నిదర్శనం కాకినాడలోని గాంధీనగర్ లోని రైతుబజార్ ను తీసుకుందాం.ఇక్కడ ప్రభుత్వం సూచించిన రైట్ల ప్రకారం అమ్మకాలు జరుపుతున్నట్లు డిస్ ప్లే బోర్డ్ ల పై చూపిస్తారు కానీ అక్కడ సూచించే రైట్లకు వారి అమ్మకాలు జరిపే రేట్లకు ఎమాత్రం పోలీక ఉండదు. ఇక్కడ కూరగాయాల ధరలన్నీ ఎక్కవ రైట్లే.  ఎందుకని అడిగితే అకాలవర్షాలతో పంటలు నష్టపోయాయని, పంటలు సరిగ్గా లేకపోవడంతో అధికరైట్లు అమ్మవలసి వస్తుందని వ్యాపారస్తులు అంటూన్నారు. దీంతో సామాన్యునికి ధరలు అందుబాటులో లేకపోవడంతో కూరగాయాలు కొనలేని పరిస్ధితి నేలకొందని  వినయోగదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.అధిక ధరలు అమ్మకాలు జరుగుతున్న రైతు బజార్ల వద్ద అధికారులు దాడులు చేసి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5353
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author