మొక్కవోని ప్రజా సంకల్పం

మొక్కవోని ప్రజా సంకల్పం
October 31 16:10 2017
ఆరంభం నుంచి చివరిదాకా పాదయాత్ర అదిరిపోయేలా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా ఆయన ప్రారంభించేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ పేరిట పాదయాత్ర మొదలు పెట్టనున్న ఆయన తనతోపాటు పార్టీ నేతలను కూడా రంగంలోకి దించుతున్నారు. ​అసలు విషయం ఏమిటంటే… నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర మొదలుకానుంది. మొదటి రోజు పాదయాత్రలో పార్టీ నేతలంతా జగన్ తో కలిసి పాల్గొననున్నారు. మొదటి రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత.. పార్టీ నేతలు.. తమ తమ సొంత నియోజకవర్గాలకు చేరుకుంటారు. ఒక వైపు జగన్ యాత్ర కొనసాగుతుంటే.. మరో వైపు నుంచి నేతలు యాత్ర చేయనున్నారు. ​పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడి నేతృత్వంలో పార్టీ నేతలు పాదయాత్రలు చేయనున్నారు. పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఒక వైపు పాదయాత్రలు చేస్తూనే.. మరో వైపు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఈ రచ్చబండ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.పాదయాత్ర సాగుతుందా… లేదా?మరోవైపు ఇప్పుడు పాదయాత్ర ముందుకు సాగుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ పాదయాత్ర మరోసారి వాయిదా పడడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. దానికి కారణం పాదయాత్ర ప్రారంబానికి ముందే అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ సాంబశివరావు ఇప్పటికే స్పష్టం చేశారు. అనుమతుల్లేని యాత్రలను అంగీకరించేది లేదన్నారు. దాంతో ఇప్పుడు ఆసక్తిగా మారింది. జగన్ పాదయాత్రకు అనుమతి కోరే అవకాశం లేదని ప్రతిపక్ష శిబిరం ఖరాఖండిగా చెబుతోంది. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అనుమతి తీసుకోకుండా ముద్రగడను రోడ్డెక్కనిచ్చేది లేదని ప్రకటించింది. ఒకసారి ముద్రగడ పోలీసులు కళ్లుగప్పి యాత్ర ప్రారంభించినప్పటికీ మధ్యలో అడ్డుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ పాదయాత్రను కూడా మధ్యలో అడ్డుకుంటారా.. అసలు అనుమతిస్తారా.. అనుమతి కోసం ప్రజాసంకల్పంతో కదులుతున్న జగన్ దరఖాస్తు చేస్తారా అన్నది కూడా చర్చనీయాంశమే. అయితే ఒకవేళ జగన్ అనుమతి కోరకుండా రోడ్డెక్కడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం అడ్డుకుంటుందా లేక చూసీ చూడకుండా సాగుతుందా అన్నదానిని బట్టి జగన్ యాత్ర భవితవ్యం తేలే అవకాశం ఉంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5396
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author