ఒకరోజు నిరసనకు దిగిన కోదండరామ్

ఒకరోజు నిరసనకు దిగిన కోదండరామ్
October 31 17:59 2017
తెలంగాణ ఐకాస చేస్తున్న కార్యక్రమాలకు  పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య వ్యతిరేక విధానాల‌కు పాల్ప‌డుతోంద‌ని కోదండ‌రామ్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా జ‌రపాల‌నుకుంటోన్న‌ ఆందోళ‌న‌ల‌పై ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న దీక్షకు దిగారు. ఈ రోజు హైద‌రాబాద్ తార్నాక‌లోని త‌న ఇంట్లోనే ఆయ‌న ఈ దీక్ష‌ను ప్రారంభించారు. త‌న దీక్ష 24 గంట‌ల పాటు కొన‌సాగుతుంద‌ని చెప్పారు.
తార్నాకలోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టినట్లు కోదండరాం తెలిపారు. ఈ దీక్ష ద్వారా తెలంగాణ సర్కారు అవలంభిస్తున్న నిర్బంధ విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టే ప్రయత్నం చేయాలన్న యోచనలో తెలంగాణ జెఎసి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్కారు ఏరకమైన వైఖరి అవలంభించిందో అదేరకమైన వైఖరి తెలంగాణ సర్కారు కూడా అవలంభిస్తోందని జెఎసి మండిపడింది. దీంతో కొలువుల కై కొట్లాట సభకు అనుమతి కోసం కోర్టు తలుపు తట్టింది జెఎసి. కానీ ఈరోజు  వరకు కూడా కోర్టునుంచి అనుమతి రాకపోవడంతో జెఎసి కార్యక్రమం సందిగ్దంలో పడింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు ఇంతటి పాశవిక చర్యలకు పాల్పడడం సరికాదని జెఎసి అంటున్నది. ఇప్పటికే జెఎసి జరపతలపెట్టిన స్పూర్తి యాత్రకు సైతం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నది సర్కారు. దీంతో అన్ని అంశాలలో సర్కారు వైఖరిని ఎండగట్టే ఉద్దేశంతోనే జెఎసి ఛైర్మన్ కోదండరా 24 గంటల నిరసన దీక్షకు దిగినట్లు జెఎసి నేతలు తెలిపారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5405
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author