ఐపీఎస్ కాపీయింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

ఐపీఎస్ కాపీయింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
October 31 18:10 2017
చెన్నైలో సివిల్స్ పరీక్ష రాసేటప్పడు హై టెక్ కాపీంగ్ చేస్తూ దొరికిపోయిన ఐపీఎస్ కరీం కేసులో దర్యాప్తు ముమ్మరం అయింది. నిందితుడు కరీంను తీసుకుని హైదరాబాద్ కు చేరుకున్న చెన్నై పోలీసులు అశోక్ నగర్ లోని లా ఎక్సలెన్సీ ఐఏఎస్ స్టడీ సర్కిల్  అకాడమీ లో ఐపీఎస్ అధికారి భార్య జాయిస్  ను , అకాడమీ డైరెక్టర్ రాంబాబు ను విచారించారు.  మాస్ కాపింగ్ లో పట్టుబడ్డ కరీం దగ్గర లభించిన సమాచారం ఆధారంగా రాంబాబు , జాయిస్ ను పోలీసులు విచారిస్తున్నారు. అకాడమీ లో కీలక మైన డాక్యుమెంట్స్ , లాప్ టాప్ ,మొబైల్స్ స్వాదీనం చేసుకున్నాట్లు సమాచారం. చెన్నై పోలీసులతోపాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్సు, స్థానిక పోలీసులు కుడా సోదాలు చేస్తున్నారు.
మరోవైపు, మాస్ కాపింగ్ వ్యవహారం బయట పడడం తో పలు విద్యార్ధి సంఘాలు అశోక్ నగర్ వద్దకు చేరుకున్నాయి. ఇలాంటి మాస్ కాపింగ్ పాల్పడడం వల్ల ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్ట పోతున్నారని ఆందోళనకు దిగాయి. కరీం కాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం తో తాను ఐపీఎస్ కూడా అడ్డదారులు తొక్కి పాస్ అయ్యాడా అన్న కోణం లో కుడా పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ లో కొన్ని కీలక అంశాలు వెల్లడయినట్లు సమాచారం. వివిధ వెబ్ సైట్లలోనుంచి తీసుకున్న సమాచారంతో   మైక్రో కెమెరా , ఫోన్ ద్వారా మాస్ కాపింగ్ పాల్పడినట్లు విచారణ లో వెల్లడయింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5412
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author