ఎఐఐబి నుండి ఏపి కి 13వేల కోట్ల రూ.ఋణం

ఎఐఐబి నుండి ఏపి కి 13వేల కోట్ల రూ.ఋణం
October 31 18:12 2017
సిఎస్ తో భేటి ఐన ఎఐఐబి బ్యాంకు ప్రతినిధి బృందం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 5ప్రాజెక్టులకు ఏసియన్ ఇన్ ఫ్రా అండ్ ఇన్వస్ట్మెంట్ బ్యాంకు(ఎఐఐబి) 13వేల కోట్ల రూ.లు(2బిలియన్ డాలర్లు)ఋణం అందించనుంది.ఈమేరకు ఆబ్యాంకు ఉపాధ్యక్షులు మరియు ఛీప్ ఇన్వస్ట్మెంట్ అధికారి డా.డిజె పాండియన్ నేతృత్వంలోగల ఆబ్యాంకు సాంకేతిక ప్రతినిధి బృందం మంగళవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి దినేష్ కుమార్ తో భేటి అయింది. రాష్ట్రంలో రోడ్లు భవనాలశాఖకు సంబంధించి 2ప్రాజెక్టులు,గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం,మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధిశాఖ,పంచాయితీరాజ్ శాఖలకు సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టు వంతున మొత్తం 5ప్రాజెక్టులకు సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ఆప్రతిపాదనలను ఏసియన్ ఇన్ ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబి)కు ఋణం మంజూరుకై పంపగా బ్యాంకు ఉపాధ్యక్షులు పాండియన్ నేతృత్వంలో గల సాంకేతిక బృందం రాష్ట్రానికి రావడం జరిగింది.ఈసందర్భంగా సిఎస్ దినేష్ కుమార్ తో ఈబృదం సచివాలయంలో కొద్దిసేపు సమావేశమై ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించింది. ఈసందర్భంగా ఏఐఐబి బ్యాంకు ఉపాధ్యక్షులు పాండియన్ ను రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ దుస్శాలువతో సత్కరించి బొబ్బిలి వీణను బహూకరించారు.ఈసమావేశంలో ఏఐఐబికి చెందిన సీనియర్ ఇన్వస్ట్మెంట్ ఆఫరేషన్స్ స్పెషలిస్టు హరిభాస్కర్,సీనియర్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్టు సోమనాధ్ బసు,సీనియర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్టు జియాకొమొ ఒట్టోలిని,కన్సల్టెంట్ యిట్జహాక్ కమ్మి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరకల వలవన్,ఆర్ధికశాఖ కార్యదర్శి యం.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5415
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author