.అందరికి న్యాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

.అందరికి న్యాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
October 31 18:19 2017

టీఆర్ఎస్ స‌ర్కార్ పై టీ.పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌రోసారి ఫైర‌య్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన అనంత‌రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఉత్త‌మ్ .. టీఆర్ఎస్ పాల‌న‌లో అవినీతిని కాగ్ తేల్చింద‌ని అన్నారు. 60 ఏళ్ల పోరాటం, విద్యార్ధుల బ‌లిదానాల‌ త‌ర్వాతే తెలంగాణ ప్ర‌త్యేక రాష్ర్టం ఏర్ప‌డిందన్న ఉత్త‌మ్ .. ప్ర‌త్యేక రాష్ర్ట ఉద్య‌మంలో పాల్గొన్న యువ‌త ఇవాళ కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు వచ్చే నెల నుంచి సర్వేలు నిర్వహిస్తామని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గెలిచే సత్తా ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తామన్నారు. సామాజిక న్యాయం, ప్రజాబలం దృష్టిలో పెట్టుకొనే టికెట్లు కేటాయిస్తామన్నారు. పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో అందరికీ న్యాయం చేస్తాన‌ని రాహుల్ చెప్పార‌ని తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన త‌రువాత ఉత్త‌మ్‌కుమార్ రెడ్డితో పాటు మీడియా ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5421
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author