చిత్తూరులో మారుతున్న రాజకీయ సమీకరణాలు

చిత్తూరులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
October 31 18:28 2017
సీకేబాబు నివాసంలో పురందేశ్వరి
చిత్తూరులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం నాడు మాజీ ఎమ్మెల్యే సీకేబాబు నివాసానికి వెళ్లడం,  ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించాయి. సీకేబాబు బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్లు సంకేతాలు రావడంతో చిత్తూరు రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. సీకేబాబుతో కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే మంచి సంబంధాలు ఉన్నాయని .. చిత్తూరులో పార్టీ కార్యక్రమానికి వచ్చానని, సీకేబాబు ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లినట్లు పురందేశ్వరి విలేకరులకు వెల్లడించారు. పార్టీ లో సీకేబాబు చేరుతారా అని విలేకరులకు ప్రశ్నించగా.. ఆ విషయం మీ ఊహకే వదిలేస్తున్నట్లు ఆమె సమాధానం ఇచ్చారు. అనంతరం కేంద్రం అమలు చేస్తున్న పథకాల గురించి వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5429
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author