ఆధార్‌ను తప్పనిసరి చేయడం దేశ భద్రతకు ముప్పు

ఆధార్‌ను తప్పనిసరి చేయడం దేశ భద్రతకు ముప్పు
October 31 18:43 2017
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి
ఓవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధార్‌నే నమ్ముకొని అన్నింటినీ ఆ ఆధార్‌తోనే లింకు చేయాలని చూస్తుంటే.. మరోవైపు అదే పార్టీ ఎంపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మాత్రం ఆధార్‌తో దేశ భద్రతకే ముప్పంటు చంచాలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనున్న రాజ్యాంగ ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలను కొట్టేస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ విషయంలో తాను త్వరలోనే ప్రధానమంత్రికి కూడా లేఖ రాస్తానని ఆయన స్పష్టంచేశారు. ఆధార్‌ను తప్పనిసరి చేయడం దేశ భద్రతకు ఎంత ముప్పో వివరిస్తూ మోదీకి లేఖ రాస్తానని ఈ ఫైర్‌బ్రాండ్ ఎంపీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రభుత్వ పథకాలతోపాటు పాన్ కార్డ్మొబైల్ నంబర్‌లకు ఆధార్ అనుసంధానంపై దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు సోమవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఓ బీజేపీ ఎంపీ ఆధార్‌ను తప్పుబట్టడం గమనార్హం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5439
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author