జనసేనతో జట్టుకడుతున్న సీపిఎం

జనసేనతో జట్టుకడుతున్న సీపిఎం
October 31 18:46 2017

ఎట్టకేలకు సి.పి.ఎం. మద్దతు కూడగట్టుకోవడంలో జగన్ పార్టీ విజయవంతమైంది. సి.పి.ఐ, జనసేన, కాంగ్రెస్ లు స్పందించాల్సి ఉంది. నవంబర్ 6 నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో చేపట్టనున్న పాదయాత్రకు మద్దతు పలికింది సి.పి.ఎం. ఈ మేరకు ఆ పార్టీతో జరిగిన చర్చలు ఫలవంతమైనట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఒంగోలు సుందరయ్య భవన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజోపయోగమైన పాదయాత్రలు ఎవరు చేసినా తమ పార్టీ ఆహ్వానిస్తుందన్నారు. జగన్‌ నే కాదు.. ఎవరూచేసినా పాదయాత్రను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జగన్ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉందన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు విమర్శించారు. రాష్ట్రంలోని మంత్రులు, వారి కుటుంబీకుల అక్రమాల గురించి రేవంత్ రెడ్డి విమర్శలు చేసినా చంద్రబాబు నోరెత్తలేదన్నారు. తన సహచర మంత్రులపై  వస్తున్న విమర్శల పట్ల సీఎం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు మధు. తాము తప్పు చేయలేదని.. పయ్యావుల కేశవ్, యనమల ఇప్పటికే ఖండించారు. ఆ సంగతి మధుకు తెలియనట్లు ఉంది. అందుకే మరోసారి విమర్శలు చేస్తున్నారని ఇంకోవైపు తెలుగుతమ్ముళ్లు అంటున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5444
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author