రాహుల్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి బృందం

రాహుల్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి బృందం
October 31 19:13 2017

దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకుని ఆ పార్టీలో చేరింది.. రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రేవంత్‌ను రాహుల్‌ గాంధీ నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా తీసుకొచ్చారు.  రేవంత్‌ను పార్టీకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్ వెంట ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చిన్నారెడ్డితో పాటు ఆయన అనుచరులు ఉన్నారు.రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, అరికెల నర్సిరెడ్డి, బి. జనార్దన్, బాపూరావు. కె. సత్యనారాయణ, మీదిపల్లి సత్యం, రాజారాం యాదవ్, జంగా యాదవ్, హరిప్రియ నాయక్, విజయరమణారావు, పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డితో సహా టీడీపీ నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రకటించారు.కాగా టీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి దొమ్మాట సాంబయ్య, ఓయూ జేఏసీ నుంచి జరు ఎల్లన్న, బాల లక్ష్మీ, భాస్కర్, మధుసూదన్ రెడ్డి తదతరులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఉత్తమ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు మదుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ యాదవ్, మాజీ ఎంపీ మల్లురవి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ, కుసుంకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌కు ఏ బాధ్యతలు అప్పగిస్తారో తెలియాల్సి ఉంది. ఇటీవల తెదేపాకు, ఆ పార్టీ పదవులకు, శానససభ సభ్యత్వానికి రేవంత్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5482
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author