అవస్థల నిలయం

అవస్థల నిలయం
October 31 19:38 2017

మహబూబ్ నగర్..అలంపూర్ ప్రాంతంలోని జోగులాంబ ఆలయంలో అపరిశుభ్రత తాండవిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చే ఈ ఆలయంలో పరిస్థితి మెరుగుపడకపోవడం విమర్శలకు తావిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి జోగులాంబ ఆలయాల దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పవిత్రమైన తుంగభద్ర నదిలో పుణ్య స్నానం చేసి తరిస్తారు. అయితే భక్తులు వెళ్తే పుష్కర ఘాట్పై ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, పాత దుస్తులు పేరుకుపోయి ఉన్నాయి. దీంతో భక్త కోటికి అవస్థలు తప్పడంలేదు. ఇక పుణ్యస్నానం అనంతరం దుస్తులు మార్చుకునే ప్రదేశంలోను చెత్తాచెదారం ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఘాట్ను శుభ్రం చేయించడంపై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. నవబ్రహ్మ ఆలయాలు, శక్తి పీఠం దృష్ట్యా శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నెల రోజుల కిత్రం కలెక్టర్ రంజిత్కుమార్ సైనీ ఆదేశించినా సిబ్బంది స్పందించలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఘాట్ శుభ్రతకు నడుం బిగించాలని.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని భక్తులు కోరుతున్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5492
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author