సన్నీ లియోన్ బాటలో మియా ఖలీఫా

సన్నీ లియోన్ బాటలో మియా ఖలీఫా
November 01 11:18 2017

సన్నీలియోన్.. ఈపేరు వింటేనే కుర్రకారు మదిలో సెగలు రేగుతుంటాయ్. ఒకప్పటి పోర్న్‌స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు. కేవలం పోర్న్ స్టార్‌గానే కాకుండా జిస్మ్ 2 మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్‌ ఐటమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటుంది. రయీస్ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలసి చిందేసిన ఈ చిన్నది తాజాగా సంజయ్ దత్ మెయిన్ లీడ్‌ చేస్తున్న ‘భూమి’ సినిమాలో ‘ట్రిప్పి ట్రిప్పి’ అంటూ ఒక ఐటెం సాంగ్‌‌లో తడి తడి అందాలతో కుర్రకారులో కాకరేపింది. దీంతో అమ్మడికి బాలీవుడ్‌లోను కాకుండా తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ సన్నీ లియోన్‌కు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా తెలుగులో రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలోనూ ఐటమ్ సాంగ్‌తో మెరవనుంది ఈ భామ.ఇదిలాఉంటే ఇప్పడు సన్నీలియోన్ బాటలోనే నడిచేందుకు మరో పోర్న్‌స్టార్ రెడీ అవుతోంది. మియా ఖలీఫా అనే మాజీ పోర్న్‌స్టార్ కొన్నాళ్లపాటు పలు అశ్లీల చిత్రాల్లో నటించి ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తుంది. అయితే ఈ అమ్మడు తనలోని మల్టీ టాలెంట్‌ను బయటపెట్టేందుకు రెడీ అయ్యింది. మలయాళ అడల్ట్‌ కామెడీ సినిమా ‘చుంక్జ్‌’ సీక్వెల్‌తో మియా ఖలీఫా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరవనున్నట్లు చిత్ర దర్శకుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ సినిమాలో మియా ఓ కీలకమైన పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. మియా ఖలీఫా నటిస్తున్న ఈ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5530
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author