ఏనుమాములలో బయోమెట్రిక్ మిషన్

ఏనుమాములలో  బయోమెట్రిక్ మిషన్
November 01 15:13 2017

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో విధులు నిర్వహించే దడువాయి కార్మికుల బయోమెట్రిక్ మిషన్ ఏర్పా టు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ ఉద్యోగులు సుమారు 40మంది, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సెక్యూరిటీ 49 మంది, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ 10మంది, ఫైర్ సెఫ్టీ సిబ్బంది నలుగురు, దినసరి ఉద్యోగి ఒక్కరు ప్రతి రోజు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేస్తున్నారు. అలాగే మార్కెట్ కమిటీ పరిధిలో పనిచేసే దడువాయిలకు కూడా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీ పరిధిలో 125 మంది దడువాయిలు ఉండగా అందులో 110 మంది వరకు తమ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8:30 నిమిషాల లోపు వారు హాజరు పట్టికలో సంతకం చేయాలి. ఇంతలో మిర్చియార్డు, పత్తియార్డు, అపరాల యార్డు, పల్లి పసుపుయార్డు, కోల్డుస్టోరేజీలకు ఎంతసరుకు వచ్చింది.ఎంత మంది దడువాయిలు అవసరమని సంబంధిత యార్డు ఇన్‌చార్జీలు నోట్ పంపిస్తారు. అప్పుడు ఆ రోజు వచ్చిన దడువాయిల హాజరు పట్టిక ప్రకారం వివిధ యార్డులకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసి పంపిస్తారు. కాగా యార్డులకు వెళ్లిన దడువాయిలు విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో అధికారు లు, అడ్తి, కరీదుదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్ బైలా ప్రకారం దడువాయి ఉంటేనే కాంటాలు నిర్వహించాలి. కానీ కొన్ని యార్డుల్లో దడువాయిలు లేకుండానే అడ్తి, కరీదుదారుల గుమాస్తాలు కాంటాలు నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దడువాయిలు కాంటాలు పెట్టకున్నా వారికి చార్జీలు ఎందుకు ఇవ్వాలని రైతులు నిలదీయగా చాలాసార్లు ఘర్షణలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒకవేళ పనిచేయని దడువాయిలకు కాంటా చార్జీలను అడ్తిదారులు చెల్లించకుంటే సంబంధింత యూనియన్ నాయకులు బెదిరింపులకు గురిచేసినట్లు చాలా సార్లు అధికారుల దృష్టికి వచ్చిన్నట్లు తెలిసింది. దీంతో రైతులకు కరీదు వ్యాపారుల మధ్యన ఉండి రైతులు మోసానికి గురికాకుండా చూడాల్సిన దడువాయిల సేవలు అందడంలేదు. అసలే గిట్టుబాటు ధరలు లభించక రైతులు తిప్పలు పడుతుంటే మార్కెట్లో దోపిడీకి గురికావల్సి వస్తుందని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక నుంచి ప్రతి దడువాయి తప్పనిసరిగా బయోమెట్రిక్ మిషన్ దగ్గర తన వేలి వేద్ర వేసి మళ్లీ ఇంటికి వెళ్లే ముందు వేలిముద్ర వేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.మార్కెట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు దడువాయి కార్మికులు ఉదయం సంతకం పెట్టిన తర్వాత వారికి డ్యూటీ అలాట్ చేస్తారు. సంబంధిత యార్డుకు చేరుకొని అధికారులకు కుంటిసాకులు చెప్పి బయటకు వెళ్లిపోయి తమ స్వంత పనులు నిర్వహించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే దడువాయిలకు అదనంగా ఆదాయం లేని యార్డుల్లో డ్యూటీ పడితే పని తప్పించుకొని వెళ్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. మరికొందరు డ్యూటీలోనే మద్యం సేవించి అధికారులతో వాగ్వాదానికి దిగిన సంఘటనలు ఉన్నాయి. అలాగే ఒకరి డ్యూటీ మరొకరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5563
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author