డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు టాప్ ప్రియార్టీ

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు టాప్ ప్రియార్టీ
November 01 23:35 2017

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి టాప్ ప్రియార్టీ ఇవ్వాలని… ప్రజాప్రతినిధులు, అధికారులంతా ప్రత్యేక శ్రద్ధ చూపాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రగతిపై ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, రాజేందర్రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోస్లతో బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలోను ఇప్పటికే 1400 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని…వీటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. టెండర్లు పిలువడంతో పాటు..పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం ఇంకా స్థలం గుర్తించని గ్రామాలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఏవైనా ఇబ్బందులుంటే స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.  గురువారం గద్వాల, శుక్రవారం వనపర్తి జిల్లాలకు సంబంధించి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ప్రగతిపై  సమీక్ష నిర్వహించనున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5659
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author