రేవంత్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

రేవంత్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
November 02 12:30 2017

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయిన రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి అదే హోదాలో ఉండేవారు. ఇన్నాళ్లూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారాయన. ఆ హోదాకు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కు తగిన పదవిని ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశంలో ఏ హోదాతో అయితే ఉన్నారో.. అదే హోదాను ఇక్కడా ఇవ్వబోతున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రాబోతోందని సమాచారం.ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి కి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇకపై కాంగ్రెస్ కు ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండబోతున్నారనమాట.మరి రేవంత్ కు ఈ హోదా దక్కితే కాంగ్రెస్ లోని పాత కాపులు ఊరికే ఉంటారా? అసమ్మతి గళలాలు వినిపిస్తారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన మిగతా నేతలకు కూడా వివిధ హోదాలను ఇవ్వబోతున్నారని… వివిధ కమిటీల్లో వారిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5682
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author