28 ఏళ్ల తర్వాత ‘శివ 2’

28 ఏళ్ల తర్వాత  ‘శివ 2’
November 02 12:50 2017

రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్‌లో 28 ఏళ్ల క్రితం వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో నేటికీ ఒక సంచలనమే. ఆ సినిమాతో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు వర్మ. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్ కానుంది. ఇటీవల ‘రాజుగారి గది 2’ మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు.శివ సినిమా తొలిషాట్ తీసిన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టుడియోలోనే తాజా చిత్రాన్ని నవంబర్ 20 న ప్రారంభిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ కంపెనీ బ్యానర్‌లో స్వయంగా ఆర్జీవీ నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే ఈ చిత్రానికి ‘శివ 2’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ నాగార్జున సరసన టబు హీరోయిన్‌గా రంగంలోకి దించుతున్నాడు వర్మ. నిన్నే పెళ్లాడతా చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరొందిన నాగ్-టబూల జంట ‘శివ 2’ తో మరోసారి కెమిస్ట్రీని వర్కౌట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. నవంబర్ 20న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టి ఏప్రిల్ నెలలో ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వివాదాల వర్మ.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5702
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author