బాబూ జగన్నాథమ్.. రిస్క్ అవసరమా?

బాబూ జగన్నాథమ్.. రిస్క్ అవసరమా?
November 02 12:53 2017

‘ఆర్య’ సినిమా మినహాయిస్తే అల్లు అర్జున్ మిగిలిన సినిమాలన్నీ కూడా అగ్ర దర్శకులతోనే కలిసి పని చేశాడు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ను పెంచుకుంటూ వస్తున్నాడు. అయితే చాలా కాలం తరువాత ఇప్పుడు రచయిత వక్కంతం వంశీకు దర్శకుడిగా అవకాశం ఇచ్చి ‘నా పేరు సూర్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. రైటర్‌గా అనుభవం ఉన్నప్పటికీ వంశీకు దర్శకుడిగా ఇది డెబ్యూ ఫిల్మ్. చాలా వరకు చేతులు మారి ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్ బన్నీ దగ్గరకు వచ్చింది.అయితే ఇప్పుడు తన తదుపరి సినిమా కూడా ఓ యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘టైగర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వి.ఐ.ఆనంద్ ప్రస్తుతం అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి వరుస సక్సెస్‌ల మీదున్న బన్నీను ‘డీజే’ రిజల్ట్ ఒకింత నిరాశ పరిచింది. ఈ క్రమంలో కొత్త డైరెక్టర్ వక్కంతం వంశీతో ప్రాజెక్ట్ ఓకే చేయడం రిస్క్ అనే చెప్పాలి. అది కాకుండా.. నెక్స్ట్ సినిమా కూడా యంగ్ డైరెక్టర్‌తో చేయాలనుకోవడం ప్రయోగాలకు దారి తీస్తుంది. విజయాల మీద ఉన్నప్పుడు మనం ఏం చేసిన చెల్లుతుంది.. కానీ బన్నీ ఉన్న పొజిషన్‌లో రిస్క్ తీసుకోవడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో బన్నీ పునరాలోచన చేస్తాడేమో చూడాలి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5705
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author