సరోగసి నిబంధనలకు కమిటీ : లక్ష్మారెడ్డి

సరోగసి నిబంధనలకు కమిటీ : లక్ష్మారెడ్డి
November 02 15:55 2017

సరోగసి విధానంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సరోగసి సెంటర్లు, సరోగసికి ప్రత్యేక చట్టం, అక్రమ సరోగసిపై చర్యలు వంటి తదితర అంశాలపై విపక్ష సభ్యులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతి శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.సరోగసి విధానంపై సూచనలు, సలహాల కోసం రిటైర్డ్ న్యాయమూర్తి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రూపొందిందన్నారు. అలాగే అనుమతి లేని సంతాన సాఫల్య కేంద్రాలు, ఫర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బంజారాహిల్స్ సాయి కిరణ్ ఆస్పత్రి నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సరోగసి నిర్వహించినందుకు చర్యలు తీసుకున్నామన్నారు.  రాష్ట్రంలో 71 సంతాన సాఫల్య కేంద్రాలు, హైదరాబాద్లో 27 ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయని తెలిపారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=5734
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author