నిండుకుండలా నల్లగొండ ఉదయ్ సముద్రం

నిండుకుండలా నల్లగొండ ఉదయ్ సముద్రం
November 04 17:57 2017
నల్లగొండ
నల్లగొండ పట్టణంలోని పానగల్ ఉదయ సముద్రం చెరువు నిండుకుండలా మారి ఉప్పొంగుతోంది. ఏఆర్‌ఎంపీ ప్రాజెక్టు ద్వారా పానగల్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో తొమ్మిదేళ్ల తర్వాతచెరువు అలుగుపోస్తుంది. దీంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు, వాహనదారులు చెరువు అలుగుపోస్తుండటాన్ని తిలకించడంతో సందడి నెలకొంది. 2009లో అలుగుపోసిన చెరువు తొమ్మిదేళ్లకు మరోసారి అలుగుపోస్తుంది. ఏఆర్‌ఎంపీ ప్రాజెక్టు నీటి విడుదల ద్వారా చెరువు అలుగుపోయడం ఇదే ప్రథమమని పలువురు చర్చించుకుంటున్నారు. పానగల్ చెరువు ద్వారా 600 గ్రామాల ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడంతో పాటు వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగుపోస్తుండటంతో గుట్టకాడిగూడెం చెరువు, గంగెనపాలెం చెరువు, చెర్వుపల్లి చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుండటం ఆయా చెరువుల పరిధిలోని రైతులకు రబీ సాగుపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6037
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author