ఉదయం రోడ్డు వేస్తే సాయంత్రం జనాభాతో నిండుతుంది : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉదయం రోడ్డు వేస్తే సాయంత్రం జనాభాతో నిండుతుంది : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
November 04 19:41 2017
హైదరాబాద్,పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి తేవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం నాడు పట్టణ రవాణా వ్యవస్థపై హెచ్ఐసీసీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో వెంకయ్య మాట్లాడారు. సైకిళ్ల వినియోగంపై ప్రచారం అవసరమన్నారు. పర్యావరణాన్ని కాపాడడంతో సైకిళ్ల పాత్ర ముఖ్యమైనదన్నారు. మెట్రో రవాణా వ్యవస్థ ఖరీదుతో కూడుకున్నదని, మెట్రో నగరాల్లో పార్కింగ్ సమస్య పెరుగుతోందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో  కోటి వాహనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికీ ఒక వాహనం ఈ రోజుల్లో కొత్తదనం అయ్యిందన్నారు. వాహనాల సంఖ్యను కుదించేందుకు పార్కింగ్ రుసుంను పెంచేస్తున్నారన్నారు. పట్టణాలలో ఉన్న వసతుల దృష్టా నగరాలలో జనాభా పెరుగుతుంది.. ఉదయం రోడ్డును వెడల్పు చేస్తె సాయంత్రం వచ్చే సరికి జనభా పెరుగుదలతో రోడ్డు నిండుతుంది. ఇంట్లో నలుగురు ఉంటె నలుగురు ఒక్కో కారును  వాడుతున్నారని అయన అన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ కార్పోరేషన్ కు ఉపరాష్ట్రపతి అబినందనలు తెలిపారు. ..ప్రపంచంలో నే పబ్లిక్. ప్రైవేట్ భాగస్వామ్యం లో ఇంతపెద్ద ప్రాజెక్టు చేపట్టి మోదటి ఫేజ్ పూర్తిచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణల అభివృద్దికోసం అయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారు తమ ఆలోచన లు పంచుకోవాలని వెంకయ్య సూచించారు.కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్ఏస్ పూరి మాట్లాడుతూ దేశంలో 50మంది ప్రజలు పట్టనాలలో నివసిస్తున్నారని అన్నారు. స్మార్ట్ సిటి, అమృత్ పధకాల వల్లపట్టణాల అభివృద్ధి చెందుతున్నాయి..మౌళికవసతులు పెరుగుతున్నాయి. దాంతోపాటు నగరాలలో ప్రవేట్ వెహికిల్స్ పెరిగాయని అన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం ను మరింత మెరుగుపరుచాలి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రతీ ఒక్కరికి సోంత ఇళ్ళు కట్టిస్తున్నాం.దేశంలో ఉన్న అందరికి ఇళ్ళు  ఉండాలనేది మా లక్ష్యమని అన్నారు. నగరాలు స్మార్ట్ సిటిగా మారాలంటె ట్రాఫిక్ సమస్యతో పాటు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు పెరగాలి ,ఇన్ఫాస్ట్రక్చర్ మౌలిక వసుతులు భాగా ఉంటెనే స్మార్ట్ సిటి అవుతుందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి, మహమూద్ అలీ మాట్లాడుతూ  నగరాల్లో రోజు రోజుకు జనాభా పెరిగిపోతోందని, హైదరాబాద్లో 10 మిలియన్ల జనాభా ఉందని అన్నారు.  నగరంలో మెట్రో రైలు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని మహమూద్ అలీ అన్నారు.. ఈ నెల 28న నాగోలు-మియాపూర్ మెట్రో మార్గం తొలిదశ మెట్రో రైలు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6059
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author