రైల్వే శాఖ సౌజన్యంతో ఆర్ఓబి,‘ఆర్ యు బి’నిర్మాణాలు 

రైల్వే శాఖ సౌజన్యంతో ఆర్ఓబి,‘ఆర్ యు బి’నిర్మాణాలు 
November 05 17:55 2017
ముఖ్యమైన పట్టణాలలో రహదారుల మరియు రైల్వే లైన్లు కలిసే దగ్గర ఆయా కూడళ్ళ వద్ద, రహదార్ల అభివృద్దిలో భాగంగా ‘ఆర్ఓబి, ‘ఆర్ యు బి’, ‘అండర్ పాస్’ లను అంచనాలలో మరియు కాంట్రాక్టులలో ప్రతిపాదించడమైనదని రోడ్స్ భవనాల శాక మంత్రి తుమ్మల  నాగేశ్వర్ రావు తెలిపారు. అవసరం మేరకు, ప్రజల సౌకర్యార్ధం, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఈ యొక్క ‘‘ఆర్ఓబి, ‘ఆర్ యు బి’, ‘అండర్ పాస్’లు, ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జి’ (ఎఫ్ఓబి ) లను విధిగా పొందు పరచటమైనదని మంత్రి తుమ్మల తెలిపారు.ఈ యొక్క వంతెనల నిర్మాణం సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతితో రైల్వే మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తి నిధులతో చేపట్టటం జరుగుతుంది. ‘ఆర్ఓబి, ‘ఆర్ యు బి’, ల ప్రతిపాదనలను రైల్వే శాఖ వారి వార్షిక ప్రణాళిక అయిన రైల్వే వర్క్స్ ప్లాన్  (ఆర్ డబ్లుపి)లో పొందుపరచి వారి అనుమతి తో చేపట్టటం జరుగుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా, అభివృద్ధి చెందుతున్న పట్టణాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ప్రతిపాదనలను రైల్వే శాఖ సౌజన్యంతో చేపట్టటం జరుగుతుందని మంత్రి తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6154
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author