జాతీయ పూల్ లోకి రాష్ట్రం 

జాతీయ పూల్ లోకి రాష్ట్రం 
November 05 18:07 2017
ఎంబీబీయస్,బీడియస్,పీజీ వైద్య సీట్ల భర్తీలో జాతీయపూల్ లోకి చేరాలని తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కుడా  వెళ్లేందుకు సీఎం అంగీకారం తెలిపారని  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. జాతీయపూల్ లోకి వెళ్లడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ సీట్లు వస్తాయి. జాతీయ స్ధాయిలో ఎంబీబీయస్ లో 27,710  సీట్లు ఉన్నాయి. వీటిలో 15% చొప్పున 4157 సీట్లు జాతీయ పూల్ లోకి చేరతాయి. అంటే మనమిచ్చే 285 సీట్లతో కలిపి 4442 సీట్లలో మన విద్యార్ధులు పోటీపడే అవకాశం ఉంది. ఇక పీజీ సీట్ల విషయంలో 415 సీట్లు ఇస్తే 6665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. జాతీయ పూల్ ద్వారా  చేరితే తెలుగు విద్యార్ధులకు ఎక్కువమందికి అవకాశం లభిస్తుంది. ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం విఫలం అయిందని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ చేసాం. ఫాతిమా విద్యార్ధుల సమస్యపై రివిజన్ పిటిషన్ వేయమని సీఎం  చెప్పారని అన్నారు. ఎంసిఐ కు వచ్చే ఏడాది ఫాతిమా కాలేజ్ లో  మొత్తం సీట్స్ రద్దు చేసి,  ఈ స్టూడెంట్స్ ని తీసుకోవాలని ప్రతిపాదన చేసినప్పటికి, ఎంసిఐ అంగీకరించలేదని అన్నారు. ప్రభుత్వం  ఎం చేయలేదు అనడం కరెక్ట్ కాదు. విద్యార్ధుల తరపున మంత్రి గా 6 సార్లు ఢిల్లీ వెళ్లి ఎంసిఐ ప్రతినిధులు, న్యాయశాఖాధికారులను కలిశాను.  సీఎం, వెంకయ్యనాయుడు ను రెండు సార్లు కలిసానని అన్నారు. విద్యార్ధులు ఏడాది చదువును కోల్పోయిన బాధలో ఉన్నారు. న్యాయ పరంగా ఎన్ని  అవకాశాలు ఉన్నాయో అన్ని  అవకాశాలు పరిశీలిస్తున్నామని అయన అన్నారు.  ఆర్.ఎం.పీ, పీ.ఎం.పీ లకు ప్రభుత్వం శిక్షణతో పాటు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్స్ ఇచ్చిన తరువాతే వైద్యానికి అనుమతిస్తామన అయన అన్నారు. మెడ్ టెక్ జోన్ నుంచి కేవలం కరెంట్ ఎకౌంట్ నుండి ఫిక్స్ డ్ ఎకౌంట్ కు మాత్రమే  నిధులు బదిలీ చేసాం.ల్యాంకో సంస్థకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని  మంత్రి తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6157
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author