ముకేష్ అంబానీ కారు డ్రైవర్‌కు నెల జీతం రూ. 2లక్షలలు

ముకేష్ అంబానీ కారు డ్రైవర్‌కు నెల జీతం రూ. 2లక్షలలు
November 05 18:36 2017
ముంబై,
తంతే గారెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో .రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ముకేష్ అంబానీ కారు డ్రైవర్‌కు ప్రతి నెల రూ. 2లక్షల జీతం చెల్లిస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినా పట్టుమని 10 వేల రూపాయల జీతం కూడా రావడం లేదు.ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్లను ఎంపిక చేసుకునేందుకు ముకేష్ అంబానీ మేనేజర్ ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదిస్తారు. డ్రైవర్‌ను ఎంపిక చేసిన అనంతరం పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. శిక్షణలో డ్రైవర్ అన్ని టెస్టులు పాస్ అయితేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. మే 2017 ఏడాదినాటికి 100మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసింది. ముకేష్ అంబానీ 38 బిలియన్‌ డాలర్ల సంపదతో టాప్‌లో ఉన్నట్లు జాబితాలో స్పష్టమైంది. అలాంటిది ఓ డ్రైవర్ నెలకు లక్షల్లోనే సంపాదిస్తున్నాడంటే ఆశ్చర్యమే..
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6167
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author