రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు : మంత్రి మహేందర్ రెడ్డి

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు : మంత్రి మహేందర్ రెడ్డి
November 05 19:06 2017
హైదరాబాద్,
యాదాధ్రి జిల్లా  బాహుపేట వద్ద జాతీయ రహాదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాదితుల కుటుంబాలకు తలా రెండు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నట్లు రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ఘటనలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న బాదితులు సరస్వతి తదితరులను ఆయన ఆర్టీసీ ఎండీ రమణారావు తో కలిసి పరామర్శించారు. ప్రమాద బాదితులకు అందుతున్న వైద్యం గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అలాగే ఘటన గురించి సరస్వతి, ఆమె కుటుంబికులను అడిగి తెలుసుకున్నారు. చిన్న నిర్లక్షం ప్రమాదానికి దోహదం చేసిందని, ఘటన దురదృష్టం, బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. అంతకు ముందే మృతి చెందిన పాపయ్య గురించి వాకాబు చేసి విచారం వ్యక్తం చేశారు.మృతి చెందిన కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ప్రతీ ఒక్కరికి రెండు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు.  అంత్యక్రియలకు గాను రూ. 10 వేలు అందించారన్నారు. అలాగే గాయాల పాలైన వారికి నాణ్యమైన,  ఖరీదైన వైద్యం అందించాలని గాంధీ ఆస్రత్రి సూపరెంటెండెంట్, ఎండీ  రమణారావు లను ఆదేశించారు. గాయాల పాలైన వారికి మందుల కోసం మరో తలా రూ. 10 వేలు అందించామన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ప్రమాదాల రేటు తగ్గిస్తున్న తరుణంలో ఇలా భారీ ప్రమాదం చోటు చేసుకోవటం మీద ఆర్టీసీ ఎండీ రమణారావు తో చర్చించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈడీ రవిందర్, పురుషోత్తం నాయక్, ఓఎస్డీ కృష్ణకాంత్,ఆర్ఎంలు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6179
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author