టాయిలెట్ స్పాన్సర్‌కు ల‌భిస్తున్న స్పంద‌న 

టాయిలెట్ స్పాన్సర్‌కు ల‌భిస్తున్న స్పంద‌న 
November 05 19:20 2017
హైదరాబాద్,                                                                                                                                                                                             కె.పి.హెచ్‌.బి కాల‌నీ టెంపుల్ స‌మీపంలో ఉన్న ప‌బ్లిక్ టాయిలెట్‌కు శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి వెళ్లాడు. అదే స‌మ‌యంలో టాయిలెట్‌ను ఉప‌యోగించి చెల్లించాల్సిన ఐదు రూపాయ‌లు ఇవ్వ‌కుండా టాయిలెట్ నిర్వాహ‌కుడితో ఘ‌ర్ష‌ణ‌కు దిగిన వ్య‌క్తిని ఆయ‌న గ‌మ‌చించారు. దీంతో టాయిలెట్ నిర్వ‌హ‌ణ స్పాన్స‌ర్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ఇచ్చిన పిలుపు గుర్తుకువ‌చ్చి వెంట‌నే ఒక‌రోజు టాయిలెట్ నిర్వ‌హ‌ణ‌కు 500రూపాయ‌లు ఇస్తున్న‌ట్టు సంగంటి  శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి ప్ర‌క‌టించారు. ఇలా న‌గ‌రంలో ఎంతో మంది టాయిలెట్ ఉప‌యోగిస్తే డ‌బ్బులు చెల్లించాల్సి ఉంటుంద‌నే నెపంతో బ‌హిరంగ మ‌ల‌మూత్రాల‌ను విస‌ర్జిస్తున్నారు. దీని నివార‌ణ‌కు త‌మ‌ పెళ్లి రోజులు, జ‌న్మ‌దినాలు, తాము అధికంగా ప్రేమించేవారి జ్ఞాప‌కార్థం ఇలా ప్రత్యేక దినోత్సవాలను మరింత వినూత్నంగా జరిపేందుకు టాయిలెట్ స్పాన్స‌ర్ అనే  ప్రత్యేక కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. స్వచ్ఛ భారత్ స్పూర్తిని ప్రతి ఒక్కరిలో కలిగించేందుకు “టాయిలెట్ స్పాన్సర్ షిప్” అనే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ  కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి శ‌నివారం ప్ర‌క‌టించారు. దీంతో న‌గ‌రంలోని అనేక‌మంది న‌గ‌ర‌వాసులు టాయిలెట్ నిర్వ‌హ‌ణ‌కు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు. కూక‌ట్‌ప‌ల్లి రైతుబ‌జార్, జె.ఎన్‌.టి.యు, రాజీవ్ స‌ర్కిల్, కె.పి.హెచ్‌.బి బ‌స్టాండ్‌ల‌లో ఉన్న టాయిలెట్ల‌ను తాను నేడు స్వ‌యంగా త‌నిఖీ చేసిన‌ట్టు సంగంటి శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి  క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డికి పంపిన సందేశంలో తెలిపారు. ఈ టాయిలెట్ల‌లో జె.ఎన్‌.టి.యు స‌మీపంలోని టాయిలెట్ నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా ఉంద‌ని, రాజీవ్ స‌ర్కిల్‌లోని టాయిలెట్‌ మూత‌ప‌డి ఉంద‌ని, కె.పి.హెచ్‌.బి టెంపుల్ బ‌స్టాండ్ స‌మీపంలోని టాయిలెట్‌ను ఒక యువ‌కుడు శుభ్రంగా నిర్వ‌హిస్తున్నాడ‌ని, అయితే ఆ టాయిలెట్ ఉప‌యోగిస్తున్న ప‌లువురు డ‌బ్బులు చెల్లించ‌క‌పోవ‌డంతో వారితో ఆ టాయిలెట్ నిర్వ‌హ‌కుడు గొడ‌వ ప‌డుతుండ‌డం గ‌మ‌నించి ఆ టాయిలెట్ నిర్వ‌హ‌ణ‌కు కావాల్సిన 500 రూపాయ‌ల‌ను అంద‌జేస్తున్న‌ట్టు శ్రీ‌నివాస్ తెలిపారు. దీంతో పాటు టాయిలెట్‌ను ఉప‌యోగించేవారి సౌక‌ర్యార్థం హ్యాండ్ వాష్‌, లిక్విడ్‌, డెటాల్ కూడా అంద‌జేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే టాయిలెట్ల నిర్వ‌హ‌ణ‌కు స్పాన్స‌ర్ చేయాల్సిందిగా త‌మ పిలుపుకు స్పందించ‌డం ప‌ట్ల శ్రీ‌నివాస్‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ అభినందించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6185
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author