మిషన్ కాకతీయతో పెరిగిన దిగుబడి : మంత్రి హరీష్ రావు

మిషన్ కాకతీయతో పెరిగిన దిగుబడి : మంత్రి హరీష్ రావు
November 06 14:53 2017
హైదరాబాద్,
మిషన్ కాకతీయతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని మంత్రి హరీష్రావు అన్నారు. సోమవారం నాడు అసెంబ్లిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు రూ.1500 నుంచి 3వేల వరకు ఎరువుల మీద పెట్టుబడి తగ్గి రైతులకు మేలు జరిగినట్లు నాబార్డు సంస్థ తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. అదే విధంగా చేపల పెంపకం విషయానికొస్తే 2013,14 విషయానికొస్తే ఉత్పత్తి 36 నుంచి 39% పెరిగి మత్స్యకారులకు మేలు జరిగిందని రిపోర్టులో తేలిందన్నారు. ఏడు కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు పొలాల్లో వేసుకున్నారన్నారు. 20కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశామన్నారు. మిషన్ కాకతీయతో 2016లో 51శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. 2 మీటర్ల కంటే ఎక్కువ భూగర్భ జలాలు పెరిగాయని, ఎండిపోయిన బోరుబావుల్లో నీటిలభ్యత 17 శాతం పెరిగిందన్నారు. మిషన్ కాకతీయతో పంట దిగుబడి పెరిగిందని, చెరువులను పునరుద్ధరించిన తర్వాత 2016 సంవత్సరంలో 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. 2013-14లో భూగర్భ జలాలు 6.91 మీటర్లు ఉంటే 2016-17 ఏడాదిలో 9.2 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. అదనపు వరద నీటి వల్ల పంటల దిగుబడి కూడా పెరిగిందన్నారు. ఎరువులు, రసాయనిక ఎరువుల భారం కూడా తగ్గిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎస్సీ వర్గీకరణను లేవనెత్తారు. అయితే మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎస్సీ వర్గీకరణపైనే చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై  హరీష్ రావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ విషయమై మరోసారి చర్చిద్దాం.. మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాని మంత్రి స్పష్టం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6310
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author