కౌలు రైతులకు లబ్ది రావాలి : షబ్బీర్ అలీ మంఢలిలో ప్రశ్నోత్తరాలు….

కౌలు రైతులకు లబ్ది రావాలి : షబ్బీర్ అలీ మంఢలిలో ప్రశ్నోత్తరాలు….
November 06 15:00 2017
హైదరాబాద్,
రాష్ట్ర ప్రభుత్వం  రైతులకు రూ  4వేలు ఇవ్వడం లో స్పష్టత లేదు. భూమిని పండించే వారు ఒకరు అయితే నిధులు మరొకరికి వెళ్తాయని శాసనమండలి సభ్యుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యనించారు. ప్రతి నాలుగు రైతు మరణాల్లో ఇద్దరు కౌలు రైతులు ఉంటున్నారు. పథకంలో కొంత మార్పు చేసి కౌలు రైతులకు లబ్ది చెందేలా చూడాలని అయన సూచించారు. విపక్ష సభ్యులకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిస్తూ  లబ్ది లేకుండా పనిచేసే వాళ్ళు రాష్టంలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు రైతులేనని స్పష్టం చేసారు.  రాష్టంలో, దేశంలో వ్యవసాయ రంగం రోజు రోజుకు దిగజారి పోతుంది. ఇంత ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉండేందుకు సీఎం రైతులకు 4వేలు ఇస్తున్నారని అయన అన్నారు. తెలంగాణ లో 96 శాతం చిన్నకారు సన్న రైతులు ఉన్నారు.  రాష్టంలో భూమి పై సర్వే చేస్తే ఒక కోటి భూమి ఉన్నట్లు తేలిందని అయన వెల్లడించారు.  2631 ఏఈవో లను భర్తీ చేసాం. ఒక్కో ఏఈవో 5వేల ఎకరాల చొప్పున కేటాయించామమని అన్నారు.  రైతు సమన్వయ కమిటీలతో అసంఘటిత శక్తులను సంఘటిత పరచడం జరుగుతుంది.  కౌలు రైతులకు 4వేలు డైరెక్ట్ గా ఇవ్వడం కుదరదు..పట్టా దారునికి కౌలు ఇచ్చే సమయంలో వాళ్ళు మాట్లాడుకోవాలని మంత్రి అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6312
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author