టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
November 06 15:21 2017
కడప,
 రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాక అధికారులు తెప్పించుకున్నారు. రాష్ట్రంలో 2020 మే 31వ తేదీ నాటికి ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయ పోస్టులను కూడా పరిగణలోకి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం పాఠశాల విద్యాశాఖకు ఆయా జిల్లాల నుంచి అందిన నివేదికల ప్రకారం 10,603పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. జిల్లాల విద్యాశాఖ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు అందించిన సమాచారం మేరకు రాయలసీమలో అనంతపురం జిల్లా మొత్తం ఖాళీలు 1236గా తేల్చారు. ఇందులో సెండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 1108, స్కూల్ అసిస్టెంట్లు 57, భాషోపాధ్యాయులు 106, వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు 15 ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం పోస్టులు 1606 కాగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 1194, స్కూల్ అసిస్టెంట్లు 221, భాషోపాధ్యాయులు 182, వ్యాయామ ఉపాధ్యాయులు 9గా ఉన్నాయి. కడప జిల్లాలో మొత్తం పోస్టులు 356కాగా స్కూల్ అసిస్టెంట్లు 104, సెకండరీ గ్రేడ్ 206, భాషోపాధ్యాయులు 40, వ్యాయామ ఉపాధ్యాయులు 6 ఖాళీ ఉన్నట్లు లెక్క తేలింది. కర్నూలు జిల్లాలో మొత్తం పోస్టులు 730కాగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 497, స్కూల్ అసిస్టెంట్లు 102, భాషోపాధ్యాయులు 98, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సెకండరీ గ్రేడ్ టీచర్లు 7,594, స్కూల్ అసిస్టెంట్లు 1849, భాషోపాధ్యాయులు 975, పిఇటిలు 185 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1600 పోస్టులు ఖాళీగా ఉండగా, కడప జిల్లాలో అతి తక్కువగా 356 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు.వీటికి సంబంధించి డిసెంబర్ చివరలో గాని, సంక్రాంతి పండుగకు ముందుగాని నోటిఫికేషన్ జారీ చేసి అర్హత పరీక్షను మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హులైన జాబితాను మే చివరి నాటికి ప్రకటిస్తారని వారంతా జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విధుల్లో చేరుతారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని, ఉపాధ్యాయ కొరత కూడా తీరుతుందని వారు స్పష్టం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6322
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author