.తూచ్… చిరుతో నో టెన్షన్

.తూచ్… చిరుతో నో టెన్షన్
November 06 16:42 2017
హైద్రాబాద్,
మెగాస్టార్ చిరంజీవికి, యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్‌కి పడటం లేదనేది పాత మాట. చిరంజీవిని విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని రాజశేఖర్, జీవితలు వదులుకోలేదనేది గతమేనట. కానీ ప్రస్తుతానికి తమ మధ్య ఏ విభేదాలు లేవంటున్నారు జీవిత రాజశేఖర్. తన లేటెస్ట్ మూవీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ని ఆహ్వానించడానికి అతడి ఇంటికి వెళ్లిన రాజశేఖర్, జీవిత దంపతులకి మెగా ఫ్యామిలి నుంచి సాదర స్వాగతం లభించింది. జీవిత రాజశేఖర్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్లారట అనేది ఆ తర్వాతి రోజు న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. కానీ దురదృష్టవశాత్తుగా జీవిత సోదరుడు మురళి మృతిచెందడంతో ఆ ప్రీమియర్ షో క్యాన్సిల్ అయింది.ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినప్పటికీ.. చిరు-రాజశేఖర్ ఒక్కటయ్యారనే వార్త మాత్రం అందరినీ అమితంగా ఆకర్షించింది. ఇదే విషయంపై స్పందించిన జీవిత రాజశేఖర్.. చిరుతో తమకెప్పుడూ ఏ రకమైన విభేదాలు లేవని అన్నారు. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. తాము చిరంజీవిని కలిసిన ప్రతీసారి ఏదో వింత జరిగినట్టుగా చూస్తారు కానీ తాము తరచుగా సినిమా వేడుకలు, సినీ ప్రముఖుల ఫంక్షన్స్‌లో కలుస్తూనే వుంటామని అన్నారామె.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6360
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author