అక్రమ టెస్టులు 

 అక్రమ టెస్టులు 
November 06 17:24 2017
గుంటూరు,
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుట్టగొడుగుల్లా ల్యాబ్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వ్యాధుల నిర్ధరణకు అర్హత కలిగిన సిబ్బంది ఎంతమంది ఉంటారనేది ఎవరికీ తెలియదు. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఉన్నాయా, వాటి నిర్వహణ ఏవిధంగా ఉంది? అవి సరిగా పనిచేస్తున్నాయా అనేది కూడా పలువురు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారామెడికల్‌ బోర్డు నిబంధనల ప్రకారం అర్హులైన వారే ప్రయోగశాలలను నిర్వహించాల్సి ఉంటుంది.
 బయోకెమిస్టు, మైక్రోబయాలజిస్ట్‌, పెథాలజిస్ట్‌ల పర్యవేక్షణలోనే కొన్ని వైద్య పరీక్షలు జరగాల్సి ఉంది. చాలా ల్యాబుల్లో టెక్నీషీయన్లు పరీక్షలు నిర్వహించి వాటి రిపోర్టులు సిద్ధం చేసి పెడుతుంటే వైద్యులు వాటిని ధ్రువీకరిస్తూ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్నిచోట్ల టెక్నీషియన్లే అన్ని రకాల పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదిగిపోయారు. ప్రతి పరీక్షకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. అయితే వాటిని పాటించేవారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు.వైద్యులు ప్రలోభాలకు లోనైతే రోగులకు నిబద్ధమైన సేవలు కొరవడతాయన్న దూరదృష్టితో వైద్యులు ఎటువంటి కమీషన్లు స్వీకరించకూడదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. నైతిక ప్రవర్తనా నియమావళిలో(6.4)లో స్పష్టంగా పేర్కొంది. కానీ వైద్యులకు కమీషన్లు భారీగా అందుతాయన్న భావన ఇప్పుడు సమాజంలో బలంగా పాతకుపోయింది. డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లలో రోగి వద్ద నుంచి వసూలు చేసే ఫీజులో కొంత మొత్తం డాక్టర్లకు ఇస్తుంటారన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రలోభాలకు లోనైన కొందరు అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధరణ పరీక్షలు సూచిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో సీనియర్‌ వైద్యుల వద్దకు వెళ్లే ముందే అక్కడ ఉండే నర్సు లేదా జూనియర్‌ వైద్యులు రోగి రాగానే ఓ జాబితాను చేతిలో పెట్టి ఫలానా ల్యాబ్‌లోనే పరీక్షలు చేయించుకుని రావాల్సిందిగా ఆదేశించడం పరిపాటిగా మారింది. రోగులు ఆ కీలక తరుణంలో ఏం చెబితే అదే చేస్తారు. నచ్చినా, నచ్చకున్నా, అనుమానం ఉన్నా కూడా ఏమీ అనలేరు. కొంతమంది మార్కెటింగ్‌ సిబ్బందిని పెట్టుకుని ఏదోఒక విధంగా రోగులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వద్ద ప్రతి ల్యాబ్ నిర్వాహకులు తప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అర్హతగల వారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. నిబంధనల ప్రకారమే ప్రయోగ పరీక్షలు చేస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉంటే డీఎంహెచ్‌ఓ అనుమతిస్తారు. ఒకసారి అనుమతి మంజూరు చేస్తే ఐదేళ్లపాటు అది అమల్లో ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ల్యాబ్‌లకు అనుమతించిన తర్వాత ఏదైనా ఫిర్యాదు ఉంటే తప్పితే అటువైపు వెళ్లి చూడటంలేదు. ఇదే అదనుగా చూసుకుని రిజిస్ట్రేషన్‌ కోసం అర్హులైన వారిని చూపించి ఆ తర్వాత దాన్ని నిర్వహించుకునేవారు ఇతరులుంటున్నారు. గుంటూరు జిల్లాలో సుమారు 600 వరకు ల్యాబ్‌లు ఉండగా 349 మంది మాత్రమే ఇప్పటి వరకూ తమ వివరాలు నమోదు చేసుకున్నట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. కృష్ణా జిల్లాల్లోనూ దీనికి భిన్నంగా ఏమీ లేదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6380
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author