జీసెస్ రూపంలో భాగమతి

 జీసెస్ రూపంలో భాగమతి
November 07 11:20 2017
హైద్రాబాద్,
అనుష్క పుట్టిన రోజు. అందుకే భాగ‌మ‌తి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. పుట్టిన రోజు, అందునా భాగ‌మ‌తి అనే అంద‌మైన పేరు… చూడ‌గానే ముద్దొచ్చేసేలా ఓ మెస్మ‌రైజింగ్ లుక్ తో భాగ‌మ‌తిని చూపిస్తార‌నుకొంటే, చిత్ర‌బృందం షాక్ ఇచ్చింది. సీరియెస్ గెట‌ప్‌, ఓ చేతిలో సుత్తి, మ‌రో చేతికి శిలువ.. ఆ క‌ల‌ర్ కాంబినేష‌న్ వాట‌న్నింటితో ‘భాగ‌మ‌తి’ లుక్ మ‌తి పోగొట్టేసేలా డిజైన్ చేసింది చిత్ర‌బృందం. ఈ సినిమాకి సంబంధించి ఇంత వ‌ర‌కూ ఎలాంటి వివ‌రాలూ బ‌య‌ట‌కు రాలేదు. హిస్టారిక‌ల్ జోన‌ర్‌లో సాగుతుందా, థ్రిల్లరా?? అనేది చెప్ప‌లేదు. ఈ లుక్ చూస్తే మాత్రం థ్రిల్ల‌ర్ అని ఖాయం చేసేసేలా ఉంది. గ్రాఫిక్కుల మ‌హిమో, లేదంటే అనుష్క నిజంగానే త‌గ్గిందో తెలీదు గానీ.. ఇక్క‌డ మాత్రం సూప‌ర్‌, అరుంధ‌తిల‌లో చూసిన అనుష్కనే క‌నిపిస్తోంది. లుక్ ప‌రంగా ఈ మార్పు ఊహించ‌లేదు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కూ `భాగ‌మ‌తి`పై ఎలాంటి అంచ‌నాలూ లేవు. అస‌లు మాట్లాడుకొన్న‌దే త‌క్కువ‌. ఈ లుక్‌తో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది ఈ ప్రాజెక్ట్‌. అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్ సంగీతం అందించాడు. మ‌ది కెమెరా ప‌నిత‌నం, క‌ళా ద‌ర్శ‌కుడు ర‌వీంద‌ర్ వేసిన సెట్స్ ఈ చిత్రానికి మ‌రింత వ‌న్నె తెస్తాయని చిత్ర‌బృందం చెబుతోంది. సంక్రాంతి రేస్‌లో ఉన్న ఈ చిత్రం.. జ‌న‌వ‌రి 11న విడుద‌ల అవుతుంద‌ని అంచ‌నా. ఒక‌వేళ అఖిల్ సినిమా డిసెంబ‌రు 22న రాకపోతే.. భాగ‌మ‌తి విడుద‌ల తేదీ మారే అవ‌కాశాలున్నాయి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6419
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author