గ్రేటర్ ట్రాఫిక్ జామ్ పై మండలిలో చర్చ

 గ్రేటర్ ట్రాఫిక్ జామ్ పై మండలిలో చర్చ
November 07 13:16 2017
హైదరాబాద్,
చర్చహైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ పై శాసనమండలిలో మంగళవారం నాడు చర్చ జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు ఇంతింతకాదని అన్నారు. మంత్రి అన్ని ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ని డల్లాస్ చేస్తానని అన్నారు. తెరాస  ప్రభుత్వం ఏర్పాటు జరిగి మూడున్నర సంవత్సరాలు అయింది..ఎ క్కడ అయింది డల్లాసని నిలదీసారు. మంత్రి నాయిని నరసింహారెడ్డి సమాధానమిస్తూ యాభై ఏళ్ల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేసిందని ప్రశ్నించారు.  హైదరాబాద్ సిటీని కాంగ్రెస్ పార్టీ డొల్ల చేసి మాకు ఇచ్చిందని వ్యాఖ్యానించారు.  ముంబాయి, బెంగుళూరు, చెన్నై నగరాలతో పోల్చితే హైదరాబాద్ సిటీ ఎన్నో రెట్లు మేలు.  వాటితో హైదరాబాద్ నగరం బెటర్ కాకపోతే నేను రాజీనామా చేస్తా…లేదంటే షబ్బీర్ అలీ చేస్తారా అని సవాలు విసిరారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6448
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author