ఇంటికి సాంకేతిక రక్షణ  

ఇంటికి సాంకేతిక రక్షణ  
November 07 16:40 2017
విజయవాడ
నవ్యాంధ్ర రాజధాని పరిధి విజయవాడ, గుంటూరు నగరాల శివారుల్లో అపార్ట్ మెంట్లు రూపుదిద్దుకున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారంతా ఆయా ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, వ్యక్తిగత నివాసాలను కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే కొన్ని కుటుంబాలు చేరిపోయాయి కూడా. జనసమర్థ ప్రాంతానికి కొంత దూరంగా ప్రశాంత వాతావరణంలో గృహాల్లో ఉంటున్న వారికి వసతుల పరంగా ఇబ్బందులు లేకున్నా..రాత్రివేళల్లో భద్రత విషయంలో కొంత స్వీయ జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి. ఈ విషయంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తూ ఖరీదైన రక్షణ పరికరాలు వినియోగిస్తున్నారు.
విజయవాడ, గుంటూరు నగరాల్లోని అపార్ట్ మెట్లలో ఇప్పటికే 70 శాతం సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. తలుపులకు సాంకేతికతతో రూపొందిన తాళాలు వాడుతున్నారు. దీనికి కారణం తరచూ చోటుచేసుకుంటున్న చోరీ ఘటనలే. ఇళ్లకు తాళాలు వేసి వూరికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన పరికరాల వినియోగం వల్ల ఇంట్లో లేని సమయంలో అపరిచిత వ్యక్తులు వస్తే తెలుసుకునేందుకు, అత్యవసరమైతే రక్షణ, అగ్నిమాపక అధికారులకు సమాచారం చేరవేసే పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. భద్రత పరికరాల విషయంలో పరిజ్ఞానం కోసం ఎక్కువ మంది ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లో ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి. తమ ఇంటి పరిస్థితులకు సరిపోతాయా..అని సరిచూసుకుంటున్నారు. చి తలుపులకు తాళాలు సెల్‌ఫోన్లో నిక్షిప్తం చేసిన పరిజ్ఞానంతో వాడేవి. ఇవరైనా తాళాలు పగలగొడితే వెంటనే సంక్షిప్త సందేశం వచ్చేలా రూపొంది ఉంటాయి. చి మ్యాజిక్‌ లైట్లు ప్రత్యేకం. రాత్రివేళలో అపరిచిత వ్యక్తులు ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తే..ఈ లైట్లు ఉన్న ప్రదేశానికి వారు వెళ్తే వెంటనే అవి వెలుగుతాయి. ఈ దీపాలు సెన్సార్‌ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. చి నిఘా కెమెరాల ఆటోమెటిక్‌ లోడింగ్‌..వ్యక్తులు ఉన్న సమయంలోనే దృశ్యాలను నమోదు చేసే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. పొగ వస్తే గుర్తించి అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తం చేసేవి. అధునాతనమైనవి పరికరాలను వినియోగిస్తున్నారు. చి ఇంటికి అతిథి వస్తే కూర్చొన్న చోటు నుంచే తలుపులు తెరవటం..సైరన్‌ మోగించటం వంటి సౌకర్యాలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ వైఫైతో అనుసంధానమై ఉంటాయి. మీ చరవాణి, ట్యాబ్‌ సిగ్నల్స్‌ను ఉపయోగంచి మీ భద్రతా పరికరాలను పర్యవేక్షించేవి ఉన్నాయి. చి చిన్న అపార్ట్‌మెంట్లలోనూ సీసీ కెమెరాలను వినియోగిస్తుంటారు. వైఫైకి అనుసంధానం చేయడంతో ఇంటి పరిసరాల్లో ఏం జరుగుతుందో సెలోఫోన్లో చూడొచ్చు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=6516
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
new
  Categories:
view more articles

About Article Author